Begin typing your search above and press return to search.

బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్ల ఆస్తులు ఎన్నో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   23 April 2024 4:43 AM GMT
బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్ల ఆస్తులు  ఎన్నో తెలుసా..?
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా... సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు.. కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించిన వారి ఆస్తుల వివరాలు ఆసక్తిగా ఉన్నాయి! ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, కూతురి ఆస్తులు తెరపైకి వచ్చాయి!

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో నామినేషన్ల పర్వం సందడిగా సాగుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నం లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌, భార్య తేజస్విని పేరిట ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... వారిద్దరి మొత్తం ఆస్తి విలువ రూ.393.41 కోట్లని అఫిడవిట్ లో వెల్లడించారు. వీటిలో... భరత్‌ పేరిట రూ.16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్థులు ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో స్థిరాస్తుల్లో శ్రీభరత్‌ పేరున రూ.183.95 కోట్లు, భార్య పేరుతో రూ.44.20 కోట్ల ఆస్తులున్నాయి. ఇక బంగారం, వెండి విషయానికొస్తే... శ్రీభరత్‌ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి ఉండగా.. తేజస్విని పేరున 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. అదేవిధంగా... భరత్‌ కు కియా, ఆడి క్యూ-7 మోడల్‌ కార్లున్నాయి. భరత్‌ అప్పు రూ.36 లక్షలు. తేజస్విని అప్పు రూ.1.52 కోట్లుగా వెల్లడించారు. ఇదే క్రమంలో... బెంగళూరులోని శ్రీభరత్‌ పై 2 పోలీసు కేసులున్నాయి.

లోకేష్ కుటుంబ ఆస్తి రూ.542 కోట్లు:

ఇదే క్రమంలో... మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు వెల్లడించారు. ఇందులో భాగంగా వారి ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో లోకేష్ పేరిట చరాస్తులు రూ.341.68 కోట్లు, స్థిరాస్తులు రూ.92.31 కోట్లు, అప్పు రూ.18.44 కోట్లు ఉండగా... భార్య బ్రాహ్మణికి రూ.45.06 కోట్ల చరాస్తులు, రూ.35.59 కోట్ల స్థిరాస్తులు.. రూ.14.34 కోట్ల అప్పులు ఉన్నాయి.

ఇదే క్రమ్మలో... వీరి కుమారుడు దేవాన్ష్‌ చరాస్తులు రూ.7.35 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.20.17 కోట్లుగా వెల్లడించారు. ఇదే సమయంలో... ముగ్గురి పేరుతోనూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ లో షేర్లు ఉన్నాయి. అదేవిధంగా... రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్ లలో లోకేష్ పై 23 కేసులున్నాయి.