Begin typing your search above and press return to search.

బాలయ్య అల్లుళ్ళు... లక్షల మెజారిటీలు !

ఏ మామకు అయినా ఇంతకంటే గర్వం గౌరవం ఏమి ఉంటుంది అన్నది కదా ఆలోచించాల్సింది. సినీ నటుడు బాలయ్యకు ఇద్దరు అల్లుళ్ళు

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:17 PM GMT
బాలయ్య అల్లుళ్ళు... లక్షల మెజారిటీలు !
X

ఏ మామకు అయినా ఇంతకంటే గర్వం గౌరవం ఏమి ఉంటుంది అన్నది కదా ఆలోచించాల్సింది. సినీ నటుడు బాలయ్యకు ఇద్దరు అల్లుళ్ళు. పెద్దల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో దాదాపుగా లక్షకు దగ్గరగా అంటే 91 వేలని మించి మెజారిటీ సాధించి గెలిచారు. అది నిజంగా బాలయ్యకు ఒక ఉత్సాహమే. ఇపుడు చిన్నల్లుడు శ్రీ భరత్ విశాఖ నుంచి నాలుగు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో సీటుని సొంతం చేసుకున్నారు. దాంతో మామ ఉత్సాహం రెట్టింపు అయింది అని అంటున్నారు.

ఏపీలో ఫలితాలు అన్నీ టీడీపీ కూటమిని అనుకూలంగా వచ్చాయి. పోటీకి నిలబడడమే చాలు గెలవడం అన్నది ఖాయంగా చేసేశారు. జస్ట్ పది సీట్లు తప్ప అన్నీ కూటమి పరమే అయ్యాయి. అలాంటి చారిత్రాత్మకమైన విజయంలో బాలయ్య అల్లుళ్ళు ఇద్దరూ ఉన్నారు. ఈ ఇద్దరు అల్లుళ్ళూ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి ఎన్నికల్లో నిలబడితే ఓటమి చూసారు. మంత్రిగా ఉంటూ నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తే అయిదు వేల ఓట్ల తేడతో ఓటమి పలకరించింది.

అలాగే శ్రీ భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే స్వల్ప తేడాతో ఓటమి వరించింది. అయినా ఈ ఇద్దరూ కూడా అయిదేళ్లూ తాము ఎంచుకున్న నియోజకవర్గంలోనే ఉంటూ జనంతో మమేకం అవుతూ విజయం వైపుగా అడుగులు వేశారు.

దాని ఫలితమే ఇంతటి భారీ విజయం దక్కింది. లోకేష్ విజయం ఏపీ రాజకీయ చరిత్రలో ఏ ఎమ్మెల్యే అభ్యర్ధికీ దక్కనిది. గత ఎన్నికల్లో తొంబై వేల దాకా జగన్ మెజారిటీ సాధించడమే రికార్డు అనుకుంటే దానిని దాటి లోకేష్ 91 వేల దాకా వెళ్లారు. అలా ఆయన సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు.

ఇక శ్రీ భరత్ విజయమూ అలాంటిదే విశాఖ ఎంపీ హిస్టరీలో ఎవరికీ నాలుగు లక్షల మెజారిటీ ఇప్పటిదాకా దక్కలేదు. అలాంటి మెజారిటీని సాధించి శ్రీ భరత్ మామ కళ్లల్లో ఆనందం నిపారు. ఇది ఒక విధంగా భారీ విజయం అని అంటున్నారు.

ఇల బాలయ్య అల్లుళ్ళు ఇద్దరూ అద్భుతమైన విజయాలతో దూసుకుని పోవడం అదే సమయంలో బాలయ్య కూడా హిందూపురం లో మూడోసారి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఇవన్నీ మామా అల్లుళ్ళకు విజయోత్సాహలే అని అంటున్నారు.