Begin typing your search above and press return to search.

భోళా బాలయ్య... అందుకే అలా...!

ఇదంతా ఎందుకు అంటే తన సొంత నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తాజాగా పర్యటించారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:47 PM GMT
భోళా బాలయ్య... అందుకే అలా...!
X

బాలయ్యకు రాజకీయాలు తెలియవు. తెలిస్తే ఆయన ఈ పాటికి రాజకీయంగా వేరే లెవెల్ లో ఉండేవారు అని అంటారు. దాని కంటే ముందు ఆయన ఉన్న సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో. ఈ రోజుకీ సీనియర్ హీరోగా హిట్స్ వరసగా ఇస్తూ దుమ్ము లేపుతున్నారు. అయినా బాలయ్య భోళాగా ఉంటారు. ఆయన ఉన్న మాట కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు.

బాలయ్యకు లౌక్యం తెలియదు అని అంటారు. ఇక రాజకీయాల్లో చాలా లౌక్యం అవసరం. అంతే కాదు ఏ టైం లో ఏ మాట మాట్లాడాలో కూడా తెలుసుకుని వ్యవహరించే వారికే అక్కడ చాన్స్ ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే తన సొంత నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తాజాగా పర్యటించారు. టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య అచ్చమైన జనసేన నేతగా కనిపించారు.

ఆయన మెడలో ఆ కండువాయే కనిపిస్తోంది. పసుపు కండువా మరి ఎక్కడా కానరాలేదు. అంత నిండుగా ఆయన మిత్రపక్షాన్ని స్వీకరించారని అర్ధం. దాని మీద వైసీపీ నుంచి సెటైర్లు ఒక వైపు పడ్డాయి. ఒకనాడు బాలయ్య జనసేనను విమర్శించారని ఇపుడు ఆ పార్టీ కండువాను కప్పుకున్నారని కూడా సోషల్ మీడియా మోతెక్కించారు.

ఇదిలా ఉంటే బాలయ్య ఎలాంటి భేషజాలు లేకుండా జనసేన నేతలు తన మెడలో కండువా వేస్తే వంగి వినయంగా వేసుకున్నారు. ఇది ఆయనలో మంచితనాన్ని సూచిస్తుంది అని అంతా అంటారు. బాలయ్య సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళుగా నాన్ స్టాప్ గా నటిస్తున్న టాప్ హీరో. ఆయన ఎన్టీయార్ కి ఘనమైన వారసుడు. అంతే కాదు ఎన్టీయార్ స్థాపించిన టీడీపీకి ఆయన రాజకీయ వారసుడు.

అయితే బాలయ్య ఇవేమీ చూసుకోరు. ఆయన డౌన్ టూ ఎర్త్ గా ఉంటారని అంటారు. ఆయన కనుక తలచుకుంటే టీడీపీకే వారసుడిగా ఉండేవారు. కానీ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఆయన జనసేన కండువాను కప్పుకుని మిత్ర ధర్మాన్ని పాటించడమే కాదు మిత్రుడు పవన్ కళ్యాణ్ణి కూడా పొగిడి తాను ఎంత మంచి మనిషి అన్నది నిరూపించారు.

ఇక చూస్తే ఏపీ అంతటా ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీలో ఉన్న కొందరు బడా నాయకులు మాత్రం పసుపు కండువాను మాత్రమే కప్పుకుని దర్శనమిస్తున్నారు. జనసేన కండువాతో ఉన్న పక్క నేతలతో షేక్ హ్యాండ్ ఇస్తూ మిత్ర ప్రేమను అలా చాటుకుంటున్నారు.

ఆ ఆత్మీయత అలా సాగుతూంటే బాలయ్య మాత్రం ఇలా వ్యవహరించడం చూసిన వారు మాత్రం బాలయ్య గ్రేటయ్యా అనే అంటున్నారు. రాజకీయాలకు అతీతంగానే బాలయ్య ఎపుడూ ఉంటారు అనడానికి ఇదొక నిదర్శనం అని అంటారు. ఏది ఏమైనా బాలయ్య హిందూపురం నుంచి మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఆయన ప్రచారం ఎలా ఉంటుందో.