Begin typing your search above and press return to search.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాలయ్య ?

జాతకాలు నమ్మని వారు సైతం అఖండ తరువాత బాలయ్య సినీ గ్రాఫ్ ఎలా ఒక్కసారిగా పెరిగిపోయిందో చూసి మరీ అవును సుమా అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 9:30 PM GMT
జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాలయ్య ?
X

డాకూ మహరాజ్ హీరో బాలయ్యకు మహారాజ యోగం కొనసాగుతోంది. అది మరింత కాలం అలా సాగుతుందని అంటున్నారు. దాంతో బాలయ్య పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెబుతున్నారు. జాతకాలు నమ్మని వారు సైతం అఖండ తరువాత బాలయ్య సినీ గ్రాఫ్ ఎలా ఒక్కసారిగా పెరిగిపోయిందో చూసి మరీ అవును సుమా అనుకుంటున్నారు.

రాజకీయాల్లో చూస్తే బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఆయన సినీ కెరీర్ 50 ఏళ్ళ మైలురాయిని దాటింది. ఇక ఆయనకు తాజాగా పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయంగా మరింత కలసి వచ్చేలా ఉంది అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ తన కార్యవర్గాన్ని పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తుంది అని అంటున్నారు. అందులో భాగంగా పొలిట్ బ్యూరో నుంచి జాతీయ కార్యవర్గం దాకా ఎన్నో కీలక సంచలన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వాటిలో ఒకటిగా వినిపిస్తున్న ప్రచారం అయితే బాలయ్యను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారు అని.

బాలయ్య పొలిట్ బ్యూరో మెంబర్ గా చాలా కాలం నుంచి ఉన్నారు. ఈసారి ఆయనను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారు అని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం అని అంటున్నారు.

ఇక తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో బాలయ్య తాను ఈ రోజు దాకా ముఖ్య పాత్రని పోషిస్తూ వస్తున్నారు. ఆయన 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో తుచ తప్పకుండా పాల్గొంటూ వస్తున్నారు. అంతే కాదు పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. పదవుల విషయంలోనూ ఆయన ఏ రోజూ కోరినది లేదు అని అంటున్నారు.

ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజియన్ లో టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారని అంటున్నారు అలాగే తెలంగాణాలో కూడా టీడీపీ గట్టిపడాలని చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమి తరువాత విపక్షం వైపు పొలిటికల్ స్పేస్ ఉందని దానిని తాము ఎంతో కొంత తీసుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

దాంతో బాలయ్య సేవలను అక్కడా ఇక్కడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు అన్నదే చర్చగా ఉంది. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికి మూడు సార్లు చేసిన నారా లోకేష్ తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని చెప్పి ఉన్నారు. ఆయనను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట.

అంతే కాకుండా ఇటు జాతీయ కార్యవర్గంలోనూ అటు పొలిట్ బ్యూరోలోనూ కొత్త ముఖాలు ఎన్నో కనిపిస్తాయని చెబుతున్నారు మొత్తానికి ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. దాంతో మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.