Begin typing your search above and press return to search.

ఒంగోలు ప్రజలకు బాలినేని గుడ్ న్యూస్... ఫిబ్రవరి 10 డెడ్ లైన్!

ఈ సమయంలో వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 1:15 PM GMT
ఒంగోలు ప్రజలకు బాలినేని గుడ్  న్యూస్... ఫిబ్రవరి 10 డెడ్  లైన్!
X

ప్రస్తుతం ఇన్ ఛార్జ్ ల మార్పు, చేర్పులు అనే అంశం అధికార వైసీపీలో రేపుతున్న అలజడి గట్టిగానే ఉందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సిఫార్సులు, సీనియారిటీ, బందుత్వం, ఆర్థిక బలం అనే వాటికి తావులేకుండా... సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాల ఆధారంగా ఇన్ ఛార్జ్ లను నియమిస్తున్నట్లు వైసీపీ పెద్దలు చెబుతున్నారు. ఈ సమయంలో వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలని అన్నారు. ఈ సందర్భంగా... మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని బాలినేని గుర్తుచేశారు.

ఇదే సమయంలో... ఎవరు సపోర్ట్ చేసినా.. చేయకున్నా వైపాలెం అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత తనదని.. గెలిపించుకుని వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి సురేష్ కూడా సపోర్ట్ చేస్తారని.. సపోర్ట్ చేయనని ఆయన చెప్పలేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. తాను అడిగిన వారికి టిక్కెట్లు ఇవ్వని చోట రాజీనామా చేయించడం ఎంత సేపు పట్టుద్ది నాకు అని ప్రశ్నించిన బాలినేని.. అట్లాంటివి ఏమీ జరగవని.. అన్నీ సామరస్యంగానే జరుగుతాయని.. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఒంగోలులో 25వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే పోటీ చేయని అని చెప్పానని.. ఆ సమయంలో తనను పలువురు వారించారని.. ఒకవేళ పట్టాలు నిజంగా రాకపోతే ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది అవుతుందని సూచించారని తెలిపారు. పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి వైదొలగాలని నిశ్ఛయించుకున్నా.. కానీ సీఎం జగన్ దయతో అది సాధ్యమైందన్నారు.

ఈ సందర్భంగా పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్‌ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.. అందరం తెలపాలని సూచించారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకోవటం వల్ల ఆలస్యం అయ్యిందని బాలినేని మండిపడ్డారు.ఇదే సమయంలో పేదలైన అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు.. 25వేళ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలియజేస్తున్నాని.. అది తన కోరిక అని బాలినేని వెల్లడించారు.

అదే విధంగా ఒంగోలు పెట్టణంలో ఇంకా ఎవరికైనా ఇళ్లు లేకపోతే తనవద్దకు వచ్చి చెప్పాలని, అప్లై చేసుకోవాలని, తాను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా బాలినేని సూచించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు పాతిక వేల మంది పేదలకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామని బాలినేని చెప్పారు.