Begin typing your search above and press return to search.

బాలినేని ఫస్ట్ కామెంట్స్!

ఈ క్రమంలో రాజీనామా అనంతరం స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 3:56 AM GMT
బాలినేని ఫస్ట్  కామెంట్స్!
X

చాలా మంది ఊహించినట్లుగానే వైసీపీకి ఆ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ క్రమంలో రాజీనామా అనంతరం స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... రాజీనామా అనంతరం స్పందించిన బాలినేని.. తాను అనని మాటలు అన్నట్లుగా జగన్ చుట్టూ ఉన్న కోటరీ క్రియేట్ చేసిందని వ్యాఖ్యానించారు! తాను జగన్ ముందు ఎప్పుడూ ఎలాంటి డిమాండ్లూ పెట్టలేదని.. నాడు ప్రభుత్వంలో తీసుకుంటున్న కొన్ని తప్పుడు నిర్ణయాలవల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని మాత్రమే చెప్పినట్లు చెపుకొచ్చారు.

ఇలా పార్టీ బాగుండాలనే ఉద్దేశ్యంతో తాను చెప్పిన మాటలను నెగిటివ్ గా తీసుకున్నారని బాలినేని తెలిపారు. ఇక చివరిగా ఒంగోలు ఎంపీగా మాగుంట ఉండాలని, ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని తాను ఫైట్ చేసినట్లు చెప్పిన బాలినేని.. అందుకు అంగీకరించలేదని.. చెవిరెడ్డికి టిక్కెట్ ఇచ్చారని.. చిత్తురు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో నెలబెట్టడం తప్పుడు నిర్ణయమని అన్నారు.

ఇక గురువారం విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ ను కలుస్తానని చెప్పిన బాలినేని.. తన్న భవిష్యత్ కార్యచరణను అక్కడే ప్రకటిస్తానని అన్నారు! వైసీపీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం వైసీపీకి బాలినేని రాజీనామా అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా... వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం, బంధుత్వం ఉన్న బాలినేని.. గత కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే! ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని.. పార్టీలో సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆయన.. 2019లో గెలిచారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నరనే వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం టిక్కెట్ విషయంలోనూ జగన్ నిర్ణయాన్ని బాలినేని వ్యతిరేకించారు! ఈ క్రమంలో తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.