Begin typing your search above and press return to search.

‘విజయమ్మకు అన్నీ తెలుసు’... ఆస్తుల వ్యవహారంపై బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో వైఎస్ కుటుంబంతో బందుత్వం ఉన్న మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 12:32 PM IST
‘విజయమ్మకు అన్నీ తెలుసు’... ఆస్తుల  వ్యవహారంపై బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
X

గత నాలుగైదు రోజులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైఎస్ కుటుంబంతో బందుత్వం ఉన్న మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... వైఎస్సార్ ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... వైఎస్సార్ కుటుంబం ఇలా ఆస్తుల కోసం తగాదాలు పడటం బాధాకరమని అన్నారు. ఆడబిడ్డ కనీరు ఆ ఇంటికి అరిష్టమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పందించిన ఆయన... రాజశేఖర్ రెడ్డి ఏమి చెప్పారనేది ఆమెకు తెలుసు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని.. ఇద్దరికీ న్యాయం చేయాలని.. నేనైనా, ఇతరులు అయినా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని అన్నారు.

ఇక.. తాను ఏ పార్టీలో ఉన్నా.. వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇక ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు.

ఇదే క్రమంలో... తాను వైసీపీలో ఆస్తులు సంపాదించుకుని, ఆ తర్వాత పార్టీ మరినట్లు కొంతమంది నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని... తన కుమారుడి సాక్షిగా తాను వైసీపీలో ఉన్నప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప సంపాదించుకోలేదని అన్నారు.

ఇక.. ఎన్నికలకు ముందే తనను పార్టీలోకి తీసుకుందామని అనుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తనతో అన్నారని.. అయితే.. జగన్ బందువులు కదా అని అడగలేకపోయినట్లు చెప్పారని.. బాలినేని వెల్లడించారు. వైసీపీలో బాలినేని లాంటి మంచివాళ్లు ఉన్నారని అప్పట్లో చెప్పారని చెప్పుకొచ్చారు!