Begin typing your search above and press return to search.

వైసీపీ అధిష్టాణంపై బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ నేతల్లో చాలా మంది వైఖరి మారీందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Aug 2024 11:13 AM GMT
వైసీపీ అధిష్టాణంపై బాలినేని శ్రీనివాస్  సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ నేతల్లో చాలా మంది వైఖరి మారీందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాదు కాదు పార్టీ అధిష్టాణం వైఖరే మారిందని మరికొంతమంది చెబుతున్నారు. ఈ సమయంలో కొంతమంది నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటే, మరికొంతమంది పార్టీలు మారిన పరిస్థితి.

ఇందులో భాగంగా... విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, సినీ నటుడు ఆలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. మాజీమంత్రి రావెల కిశోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

అవును... గతకొన్ని రోజులుగా తనపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారంపైనా.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి దక్కని సహకారంపైనా.. తనపై వస్తోన్న ఆరోపణలపైనా మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి తనకు మద్దరు రావడం లేదని, ఈ విషయంపై పార్టీ తనను కనీసం పట్టించుకోవడం లేదని.. పార్టీకి చెబుదామంటే కనీసం వినే పరిష్తితుల్లో కూడా లేనట్లుగా ఉందని బాలినేని వాపోయారు. తాను పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేసినా.. ఎవరూ తనవైపు చూడటం లేదని చెప్పుకొచ్చారు.

సరికదా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రచారం కూడా చేస్తున్నారని చెప్పిన బాలినేని.. బహుసా తాను జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకే తనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారేమో అని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తనకు ప్రజల మద్దతు ఉందని.. ఎవరికీ భయపడేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... తనపై వస్తోన్న భూకబ్జా ఆరోపణలపైనా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... భూకబ్జాలు, స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనపై రాజకీయంగా ఇలా దాడి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తనపై సీఐడీ కాదు, సీబీఐతో కూడా విచారణ చేయించాలని కూటమి ప్రభుత్వానికి తెలిపారు!