జగన్‌పై బాలినేని డైరెక్ట్ ఎటాక్.. ఓ రేంజ్‌లో!
వైసీపీ అధినేత జగన్‌ను విమర్శించనని చెప్పిన ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా జగన్‌పై నిప్పులు కురిపించా
By: Tupaki Desk | 29 Nov 2024 11:30 AM GMTవైసీపీ అధినేత జగన్‌ను విమర్శించనని చెప్పిన ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా జగన్‌పై నిప్పులు కురిపించారు. డైరెక్ట్ ఎటాక్ చేశారు. అదానీతో సౌర విద్యుత్ ఒప్పందం వ్యవహారం తెరమీదికి రావడం, దీనిని స్వాగతిస్తూ.. జగన్ చేసిన కామెంట్లు, ఎన్నిక ల్లో ప్రజలు తప్పు చేశారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలపై బాలినేని ఘాటుగా స్పందించారు.
జగన్ తీరు ఇంకా మారలేదని బాలినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌లో మార్పు రాకపోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠగా పేర్కొన్నారు. ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలినేని సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆయన ఢిల్లీలో విందు ఇచ్చారని, దీనికి కొందరు వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారని తెలిపారు.
అలా ఆ విందులోపాల్గొన్న వైసీపీ ఎంపీలకు తిరిగి జగన్ టికెట్‌లు ఇవ్వలేదని బాలినేని చెప్పారు. వీరిలో మాగుంట శ్రీనివాసులరెడ్డి(ప్రస్తుత ఒంగోలు ఎంపీ) ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందే తాను పార్టీ మారి ఉంటే.. తనకు మంత్రి పదవి దక్కి ఉండేదన్నారు. చంద్రబాబుతో తాను ఎన్నికలకు ముందే టచ్‌లోకి వెళ్లినట్టు బాలినేని చెప్పారు. అప్పట్లో నే ఆయన తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని అయినా.. తాను పార్టీ మారలేదన్నారు.
జగన్ కు ఖచ్చితంగా శిక్ష పడుతుందని అందరూ అంటున్నారని, ఆయన తప్పు చేసి ఉంటే.. శిక్ష అను భవించాలనేదితన అభిప్రాయమని బాలినేని వెల్లడించారు. పథకాలను నమ్ముకుని జగన్ ఎవరినీ పట్టించుకోలేదన్నారు. కార్యకర్తలను, నాయకులను కూడా నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్యానించారు. ``ఓడిపోయిన తర్వాత ఎవరైనా మారతారు. కానీ, జగన్‌లోమాత్రం ఎలాంటి మార్పూ కనిపించడంలేదు`` అని బాలినేని వ్యాఖ్యానించడం గమనార్హం.