Begin typing your search above and press return to search.

బాలినేని ఆశించింది.. జ‌గ‌న్ చేయంది.. ఈ విష‌యాలు తెలుసా?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం గా మారింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 11:30 AM GMT
బాలినేని ఆశించింది.. జ‌గ‌న్ చేయంది.. ఈ విష‌యాలు తెలుసా?
X

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం గా మారింది. ఆయ‌న పార్టీకి రాం రాం చెబుతార‌ని ముందుగానే తెలిసినా.. జ‌గ‌న్‌తో ఉన్న అనుబంధం.. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధం నేప‌థ్యంలో ఆయ‌న బెదిరిస్తున్నారే త‌ప్ప‌.. పార్టీ మారే ఉద్దేశం ఆయ‌న‌కు లేద‌ని మ‌రో వాద‌న కూడా వినిపించింది. కానీ, బాలినేని మెజారిటీ రాజ‌కీయ విశ్లేష‌కులు వేసిన అంచ‌నా ప్ర‌కార‌మే వైసీపీకి రాజీనామా చేశారు.

అయితే.. అస‌లు బాలినేని వంటి `రెడ్డి` నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు స‌మీప బంధువు కూడా అయ్యే నాయ‌కుడు ఇలా ఎందుకు చేయాల్సివ‌చ్చింద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. బాలినేని రాజీనామా అనంత‌రం.. వైసీపీ అనుకూల వ‌ర్గాలు.. ఆయ‌న వైసీపీకి వెన్నుపోటు పొడిచార‌ని పేర్కొంటున్నాయి. ఇక‌, బాలినేని వ‌ర్గం మాత్రం త‌మ నాయ‌కుడికే వైసీపీ తీవ్ర అన్యాయం చేసింద‌ని పేర్కొంటున్న ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు బాలినేని ఏం ఆశించారు? జ‌గ‌న్ ఏం చేయ‌లేదు? ఎందుకీ రాజీనామా అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో కొన్ని కీల‌క విష‌యాలు ఇవీ..

+ బాలినేని ఆశించింది.. పూర్తిస్థాయిలో మంత్రిగా ఐదేళ్లు కొన‌సాగాలని. కానీ, జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల‌కే ఆయ‌న‌ను తొల‌గించారు. ఈ క్ర‌మంలో బాలినేని.. స‌రే.. న‌న్ను ప‌క్క‌న పెట్టారు క‌దా.. అప్ప‌టిఎర్ర‌గొండ పాలెం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను కూడా మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరారు. దీనికి జ‌గ‌న్ స‌సేమిరా అన్నారు. ప‌లితంగాప్ర‌కాశంలో రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డ్డాయి. ఇది బాలినేని మాన‌సికంగా ఇబ్బంది పడేలా చేసింది.

+ వైసీపీలోని జ‌గ‌న్ బంధువు ఒక‌రు బాలినేనికి వ్య‌తిరేకంగా స్థానిక ఒంగోలు మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌చారం చేశారు. ఆయ‌న కుటుంబ‌పైనా విమ‌ర్శ‌లు చేశారు. దీనిని అడ్డుకోవాల‌ని.. పేరు ఊరు స‌సాక్ష్యం గా జ‌గ‌న్‌కు బాలినేనిఫిర్యాదు చేశారు. కానీ, ఎలాంటి చ‌ర్య‌లూ ఆయ‌న తీసుకోలేదు.

+ ఇక‌, త‌న ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో 25 వేల మందికి ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చాన‌ని.. ఈ మేర‌కు నిధులు ఇవ్వాల‌ని బాలినేని కోరారు. ముందు కాద‌న్నా.. చివ‌ర‌కు ఆయ‌న‌ను సంతృప్తి ప‌రిచేందుకు జ‌గ‌న్ చివ‌రి నిమిషంలో నిధులు విడుద‌ల చేయించారు. అయితే.. ఇంత బ్ర‌తిమాలించుకుంటారా? అని బాలినేనిఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

+ ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రె డ్డికే టికెట్ ఇవ్వాల‌న్న‌ది బాలినేని డిమాండ్‌. దీనిపై చాలా రోజులు చ‌ర్చ జ‌రిగింది. అయినా.. జ‌గ‌న్ మాగుంట‌ను ప‌క్క‌న పెట్టారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో బాలినేని స‌ర్దుకు పోయారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఈ విష‌యం కూడా ఇబ్బందిగానే మార‌డంతో బాలినేని ఇప్పుడు పార్టీకే దూర‌మ‌య్యారు.

+ ఇక‌, వైవీ సుబ్బారెడ్డి దూకుడును త‌గ్గించాల‌ని.. ఒంగోలులో స్వేచ్ఛ‌గా కార్య‌క్ర‌మాలు చేసుకునే వెసులు బాటు క‌ల్పించాల‌న్న‌ది బాలినేని వ‌ర్గంమాట‌. కానీ, జ‌గ‌న్ ఈ వాద‌న‌ను కొట్టి పారేశారు. వైవీతో క‌లిసి అడుగులు వేసేది లేద‌న్నారు. కానీ, జ‌గ‌న్ వినిపించుకోలేదు. దీంతో చివ‌ర‌కు బాలినేని రిజైన్ దిశ‌గా అడుగులు వేశారు.