Begin typing your search above and press return to search.

చెవిరెడ్డికి కౌంటర్ ఇస్తూ కీలక ప్రశ్నలు... బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు!

అదానీతో విద్యుత్ ఒప్పందాల్లో రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నట్లు వార్తలు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Nov 2024 10:45 AM GMT
చెవిరెడ్డికి కౌంటర్  ఇస్తూ కీలక ప్రశ్నలు... బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
X

అదానీతో విద్యుత్ ఒప్పందాల్లో రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నట్లు వార్తలు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నుంచి వివరణలతో కూడిన సమాధానం రావడం ప్రస్తుతానికి ఈ టాపిక్ బ్యానర్ ఐటం నుంచి లోపలి పేజీల్లోకి తన ప్రాధాన్యతను మార్చుకుందని అంటున్నారు! ఈ నేపథ్యంలో బాలినేని పాత్రపైనా చర్చ జరిగింది.

ఇందులో భాగంగా... అప్పటి విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం తెలియదా.. మంత్రి ప్రమేయం లేకుండా అసలు ఇది ఎలా జరుగుతుంది, ఆయన సంతకం కంపల్సరీ కదా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే... సెకీతో ఒప్పందంలో తన ప్రమేయం ఏమీ లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు! దీనిపై చెవిరెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా.. కేవలం రాజకీయ స్వార్ధం తోనే బాలినేని మాట్లాడుతున్నారని మొదలుపెట్టిన చెవిరెడ్డి.. ఎనర్జీ కమిటీ ఫైల్ పై బాలినేని సంతకం పెట్టలేదా? అని ప్రశ్నించారు. గత వైసీపీ సర్కార్ లో బాలినేనికి ఉన్నంత స్వేచ్ఛ ఎవరికీ లేదని అన్నారు. ప్రస్తుతం బాలినేని భ్రమలో ఉండి మాట్లాడుతున్నారని.. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతుందని అన్నారు.

సెకీ ఒప్పందం రాష్ట్రారనికి ప్రయోజనం అని.. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే, వైసీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగిందని అన్నారు. బాబు అపాయింట్ మెంట్ కోసమే బాలినేని తాపత్రయం పడుతున్నట్లున్నారని మండిపడ్డారు. దీనిపై తాజాగా బాలినేని శ్రీనివాస్ స్పందించారు.

ఇందులో భాగంగా... అదానీతో విద్యుత్ ఒప్పందాల్లో లంచం తీసుకున్నట్లు వార్తలు వస్తే.. అప్పట్లో విద్యుత్ మంత్రిగా ఉన్నందున తాను ఏం జరిగిందో చెప్పానని బాలినేని తెలిపారు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమి తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ప్రశ్నించారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని అన్నారు.

వైఎస్ పై అభిమానంతోనే ఆయన మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకొని వైసీపీలోకి వెళ్లానని చెప్పిన బాలినేని.. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా? విజయమ్మ, షర్మిలా కాదా? అని సూటిగా ప్రశ్నించారు. వారిపై అసభ్యకర పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలోనే సెకీతో ఒప్పందం అంశంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. అసలు సీఎండీ ఫైలు కూడా తన వద్దకు రాలేదని మాజీ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. దీంతో... గత ప్రభుత్వంలో పరిస్థితులకు ఇదొక ఉదాహరణ అని అంటున్నారు!