బాల్క సుమన్ అరెస్ట్... మంత్రి, అధికారులు సీరియస్!
అవును... బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు.
By: Tupaki Desk | 21 Jun 2024 12:35 PM GMTబీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే... స్వయంగా సీఎం లోపల ఉన్న సమయంలో ఆ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు బీఆరెస్స్ శ్రేణులు ప్రయతించడంపై అటు ఉన్నతాధికారులు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
అవును... బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సమయలో సీఎం సమక్షంలో పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకోంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో పోచారం ఆ ఇంటిముందు బీఆరెస్స్ శ్రేణులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే కొంతమంది బీఆరెస్స్ శ్రేణులు పోచారం ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆరెస్ యూవీ నేత గెల్లు శ్రీనివాస్ తదితరులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బీఆరెస్స్ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు.
మరోవైపు... సీఎం లోపల ఉన్నప్పుడే పోచారం ఇంటివద్దకు బీఆరెస్స్ నేతలు భారీగా చొచ్చుకురావడం కలకలం రేపింది. దీంతో... బీఆరెస్స్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే... తాజాగా బీఆరెస్స్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో.. స్వయంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో... తెలంగాణ అసెంబ్లీలో బీఆరెస్స్ బలం రోజు రోజుకీ బలహీనపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!