దెబ్బతిన్న సముద్ర గర్భ కేబుల్స్... ఇంటర్నెట్ కు అంతరాయం!
సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతింటే అది మొత్తం వ్యవస్థను ఏ స్థాయిలో ఆటంకపరుస్తుందనే సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 19 Nov 2024 12:49 PM GMTసముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతింటే అది మొత్తం వ్యవస్థను ఏ స్థాయిలో ఆటంకపరుస్తుందనే సంగతి తెలిసిందే! ఇంటర్నెట్ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడితే వ్యవస్థ మొత్తం ఏ స్థాయిలో స్తభించిపోతుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజగా బాల్టిక్ సముద్ర గర్భంలో రెండు కీలక ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతిన్నాయి.
అవును.. లిథువేనియా – స్వీడన్ మధ్య బాల్టిక్ సముద్ర గర్భంలోని రెండు ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక టెలీకమ్యునికేషన్స్ కంపెనీలు గుర్తించాయి. ఈ విషయాన్ని “టెలియా లిథువేనియా” సంస్థ వెల్లడించింది. ఈ కేబుల్స్ తెగిపోవడంతో ఇంటర్నెట్ టాఫిక్ కు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది.
ఇక దెబ్బతిన్న రెండు కేబుల్స్ బాల్టిక్ సముద్రంలోని ఒక నిర్దిష్ట విభాగంలో క్రాస్ అవుతున్నాయని.. అయితే ఒకేసారి రెండూ అంతరాయం కలిగించినందున.. ఇవి ఓడ యాంకర్ వల్ల ప్రమాదవశాత్తు తెలినవి కాదని స్పష్టంగా తెలుస్తుందని.. అంతకు మించిన తీవ్రమైన ప్రభావం వల్ల దెబ్బతిని ఉంటాయని అన్నారు!
ఈ సందర్భంగా స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి... ఇప్పుడు ఏర్పడిన అంతరాయం పరికరాలు పాడైపోవడం వల్ల ఏర్పడింది కాదని.. కేబుల్ దెబ్బతినడంతో తలెత్తిందని పేర్కొన్నారు. అయితే... ఈ పనికి పాల్పడింది రష్యా దళాలు అయ్యి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క... ఫిన్లాండ్ - జర్మనీ మధ్య ఇంటర్నెట్ కెబుల్ కూడా దెబ్బతిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఫిన్లాండ్ కు చెందిన "సినియా" అనే సంస్థ తాజాగా ధృవీకరించింది. అయితే... తమ దేశం నుంచి మధ్య ఐరోపా ప్రాంతాన్ని అనుసంధానించే ఏకైక కేబుల్ అదేనని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నలు తెలిపింది.
ఇటు ఫిన్లాండ్, అటు స్వీడన్లకు చెందిన ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతినడం వేళ రష్యాను అనుమానించడం వెనుక ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... దెబ్బతిన్న రెండు కేబుళ్ల మధ్య 60 నుంచి 65 మీళ్ల దూరం ఉండగా.. ఈ కేబుల్లు ఉన్న ప్రదేశాలో రష్యా దళాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.