52 కోట్ల బనానా, వెయ్యి కోట్ల పెయింటింగ్ ను ఎప్పుడైనా చూశారా?
మరికొంతమంది మాత్రం.. వాటిని కళ్లతో చూడకూడదంటూ కాస్త డీప్ గా చెబుతుంటారు.
By: Tupaki Desk | 21 Nov 2024 12:30 PM GMTకొన్ని వస్తువులకు వేలంలో పలికే ధరలు షాకింగ్ గా ఉంటాయనేది తెలిసిన విషయమే. ఆయా వస్తువులకు అంతింత ధరలు ఎందుకు పలికాయనేది ఆది దక్కించుకున్న వ్యక్తికి, వేలం నిర్వాహకులకు మాత్రమే తెలుస్తుందని అంటారు. మరికొంతమంది మాత్రం.. వాటిని కళ్లతో చూడకూడదంటూ కాస్త డీప్ గా చెబుతుంటారు.
ఈ సమయంలో.. తాజాగా "బనానా టెప్" మరోసారి వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన బనానా టెప్ ను సోథ్ బే అనే సంస్థ వేలంలో ఉంచింది. న్యూయార్క్ లో నిర్వహించిన ఈ వేలంలో దాని ధర రూ.52 కోట్లు పలికింది. దీంతో... బనానా టేప్ మరోసారి వార్తల్లో నిలిచింది.
అవును... న్యూయార్క్ లో నిర్వహించిన వేలంలో బనానా టెప్ ను రూ.52 కోట్లు చెల్లించి మరీ దక్కించుకున్నారు క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్. దీనిపై స్పందించిన జస్టిన్ సన్... ఇది కేవలం ఆర్ట్ వర్క్ మాత్రమే కాదని.. ఆర్ట్, మీమ్స్, క్రిప్టోకరెన్సీ కలగలిసిన ప్రపంచాలను ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు.
కాగా... కమెడియన్ పేరిట చేసిన ఈ బనానా అర్ట్ వర్క్ ను తొలిసారిగా మియామీ బీచ్ ఆర్ట్ బాసెల్ లో 2019లో ప్రదర్శించారు. ఆర్ట్ వర్క్ లో భాగంగా.. ప్రతీ మూడు రోజులకు ఒకసారి అరటి పండును మారుస్తుంటారు. అప్పటి నుంచి ఈ బనానా టేప్ ను కళాఖండంగా భావించాలా వద్ద అనే చర్చ జరుగుతూనే ఉంది.
ఆ సంగతి అలా ఉంటే... న్యూయార్క్ క్రిస్టీస్ వేలంలో ఓ పెయింటింగ్ కళ్లు చెదిరే ధర పలికింది. ఇందులో భాగంగా... "మాస్టర్ ఆఫ్ సర్రియలిజం" రెనె మాగ్రిట్.. పగలు, రాత్రి అద్భుతంగా కనిపించేలా వేసిన "ది ఎంపైర్ ఆఫ్ లైట్" కళాఖండం 121 మిలియన్ డాలర్లు పలికింది. అంటే... సుమారు 1,021 కోట్ల రూపాయలన్నమాట.