Begin typing your search above and press return to search.

బండారు నోటి దూలే.. ఆయన్నుఅరెస్టు అయ్యేలా చేసిందా?

బండారుచేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని రాయలేనంత దారుణ భాషను ఆయన ఉపయోగించినట్లుగా చెప్పాలి. రోజా బతుకు ఎవరికి తెలీదు

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:27 AM GMT
బండారు నోటి దూలే.. ఆయన్నుఅరెస్టు అయ్యేలా చేసిందా?
X

మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేయటం.. ఈ సందర్భంగా భారీ ఎత్తున హైడ్రామా చోటు చేసుకుంది. అయితే.. బండారు సత్యానారాయణను తప్పుడు ఆరోపణలతోనో.. ఇంకేదో మనసులో పెట్టుకొని అరెస్టు చేసింది లేదని స్పష్టం చేస్తున్నారు. నోటితో ఆయన చేసిన వ్యాఖ్యలే జైలుకు వెళ్లే పరిస్థితులకు కారణమైనట్లుగా చెప్పాలి.

రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ.. ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. కానీ.. ఎక్కడా కూడా హద్దులు దాటకూడదు. కానీ.. బండారు ఎపిసోడ్ లో ఆయన అన్ని లక్ష్మణ రేఖల్ని దాటేశారు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. మంత్రి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఇదే ఆయన్ను అరెస్టు అయ్యేందుకు కారణమైంది. ఇంతకూ మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు ఏమేం వ్యాఖ్యలు చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మరీ.. ఇంత దారుణమా? అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

బండారుచేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని రాయలేనంత దారుణ భాషను ఆయన ఉపయోగించినట్లుగా చెప్పాలి. ‘రోజా బతుకు ఎవరికి తెలీదు. బ్లా ఫిల్మ్ లో యాక్టు చేశారు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆమె బతుకు బయట పెట్టకూడదని వాటిని విడుదల చేయలేదు. ఆమె బజారు మనిషి’’ అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. ఆయనన చేసిన వ్యాఖ్యల కారణంగా.. కోర్టు సైతం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు రిజెక్టు చేయటం గమనార్హం. తనను పోలీసులు అక్రమంగా నిర్బందించారంటూ బాండారు.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని విచారించేందుకు హైకోర్టు రిజెక్టు చేసింది.