Begin typing your search above and press return to search.

రోజా వల్ల వైసీపీకి దెబ్బట...బండారు వల్ల టీడీపీకి కూడానా...?

సుద్దులు ఎవరైనా చెబుతారు. నీతులు చెప్పడం బూతులు మాట్లాడడం వర్తమానంలో నేతలకు అలవాటు అయింది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:53 PM GMT
రోజా వల్ల వైసీపీకి దెబ్బట...బండారు వల్ల టీడీపీకి కూడానా...?
X

సుద్దులు ఎవరైనా చెబుతారు. నీతులు చెప్పడం బూతులు మాట్లాడడం వర్తమానంలో నేతలకు అలవాటు అయింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి మహిళా మంత్రి రోజా మీద అనాల్సినవన్నీ అనేసి తాపీగా ఇపుడు సుద్దులు చెబుతున్నారు.

రోజా ఉండడం వల్ల వైసీపీని నష్టం అంటున్నారు. ఆమెను పార్టీలో కట్టడి చేయాలని వైసీపీ అధినాయకత్వానికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ఆ మాటే నిజం అనుకుంటే బండారు వల్ల టీడీపీకి కూడా నష్టం కదా. ఆయన లాంటి వాచాలత్వం కలిగిన వారు మహిళల మీద ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన వారు ఉంటే టీడీపీ నష్టపోదా.

అంటే బండారు టీడీపీకి బంగారం అన్న మాట. తాను అన్న మాటలకు జనంలో మంచి రెస్పాన్స్ వచ్చింది అని బండారు చెప్పుకోవడం నిజంగా రాజకీయ దివాళాకోరు తనమే. తన వందిమాగధులు తన అనుచరులు పొంగిపోతే లోకమంతా తన మాటలను మెచ్చారనుకోవడం ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్న బండారుకు భావ్యంగా ఉందా అంటున్నారు.

ఆయన వయసుకు తగిన మాటలు మాట్లాడితే హుందాగా ఉంటుంది. రోజాను ఎందుకు బూతులతో విమర్శించారు అంటే అపుడెపుడో రెండేళ్ల క్రితం భువనేశ్వరిని వైసీపీ వారు అన్నారని దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా బండారు మాట్లాడుతున్నారు. వైసీపీ వారు చేసింది తప్పు అయితే బండారు కూడా అదే చేస్తారా రాజకీయంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన బండారు వివేచన ఇంతేనా అని జనం నవ్విపోతున్నారు అన్నదే ఆయన తెలుసుకోవడంలేదు అంటున్నారు.

బండారు వైసీపీది అరాచక పాలన అంటున్నారు. ఈ ప్రభుత్వం ఆరు నెలలలో పోతుంది అంటున్నారు. రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా ఓకే. కానీ మహిళల విషయంలో మాట్లాడినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటున్నారు. తనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని చెబుతూనే రోజా మీద ఈ రకంగా అన్నాను అని బండారు సమర్ధించుకోవడం చూస్తూంటే ఆయన మారుతారు అని అనుకోవడం భ్రమే అంటున్నారు.

మరో వైపు చూస్తే బండారుకు బాసటగా టీడీపీ వారు ఏకంగా మహిళా నాయకులు దిగిపోవడం చూస్తే రాజకీయ విమర్శలలో కొత్తగా బూతులను తెచ్చి బండారు వారు దాన్ని పొలిటికల్ డిక్షనరీలో చేర్చిన దానికి అంతా చప్ప్పట్లు కొట్టేస్తున్నారు అన్న మాట. చివరిగా బండారుకు ఒక్క విషయం చెప్పాల్సి ఉంది. ఆయన చిన్నల్లుడు అదే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు వయసులో చాలా చిన్న కానీ మాటకారిగా ఉన్నారు.

ఆయన జగన్ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. ఎపుడూ హుందాతనం అయితే ఎక్కడా కోల్పోలేదు పార్టీలు వేరు అయినా అందరూ ఆయన పనితీరు పట్ల మెచ్చుకుంటున్నారు అంటే అది కదా గొప్పతనం. నాలుగు అని నాలుగు తిని ఇదేనా సీనియర్ నేతలు టీడీపీలో జూనియర్స్ కి ఇచ్చే సందేశం అంటే బండారు లాంటి వారి ఏమి జవాబు చెబుతారో అంటున్నారు.