Begin typing your search above and press return to search.

"అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక పలు అనుమానాలు"... తెరపైకి కీలక చర్చ!

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 12:22 PM GMT
అల్లు అర్జున్  ఎపిసోడ్  వెనుక పలు అనుమానాలు... తెరపైకి కీలక చర్చ!
X

గత కొన్ని రోజులు.. ప్రధానంగా నాలుగు రోజులుగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్స్ తో పాటు బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

ఈ సందర్భంగా... తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక తమకు చాలా అనుమానాలున్నాయని అన్నారు.

అయితే... ఈ అంశంపై చర్చ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా.. సినీ పరిశ్రమ తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని చెప్పిన బండి సంజయ్... అదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు.

ఇదే సమయంలో... కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యనేతలు ఎవరూ తెలుగు సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఇపటికైనా సీఎం రేవంత్ అదుపులో పెట్టాలని బండి సంజయ్ సూచించారు.

మరోపక్క... అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ పై గౌరవం లేదన్నట్లుగా సంజయ్ స్పందించారు! హైదరాబాద్ మహా నగరంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఉన్నా కూడా ఒక్కసారి కుడా రేవంత్ అక్కడికి వెళ్లలేదని అన్నారు.

ఇదే సమయంలో.. ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని, ఆయన చరిత్ర నిక్షిప్తం అయి ఉన్న గదుల్లోకి సందర్శకులను సైతం వెళ్లనీయడం లేదని విమర్శించారు! నాడు అధికారంలో ఉన్న బీఆరెస్స్.. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను నత్తనడకన కొనసాగించిందని.. బీజేపీ వెంటపడి మరీ ఆ పనులు పూర్తి చేయించిందని చెప్పుకోవడం గమనార్హం!