Begin typing your search above and press return to search.

క‌విత‌కు బెయిల్‌: బండి సెటైర్‌.. కేటీఆర్ సీరియ‌స్‌!

కాగా, కార‌ణాలు ఏమైతేనేం.. తాజాగా.. సుప్రీంకోర్టు క‌విత‌కు బెయిల్ మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 1:30 PM GMT
క‌విత‌కు బెయిల్‌:  బండి సెటైర్‌.. కేటీఆర్ సీరియ‌స్‌!
X

బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు సుదీర్ఘ న్యాయ పోరాటం త‌ర్వాత‌.. సుప్రీంకోర్టులో బెయిల్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో చిక్కుకుని మార్చి 15న అరెస్టు అయిన‌.. క‌విత అనేక ప‌ర్యాయాలు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా.. విఫ‌ల‌మ‌య్యారు. కాగా, కార‌ణాలు ఏమైతేనేం.. తాజాగా.. సుప్రీంకోర్టు క‌విత‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ వ్య‌వ‌హారం .. రాజ‌కీయంగా దుమారం రేపింది.. ''కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు'' అని బీజేపీ నేత‌ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ఇది కాస్తా రాజ‌కీయ విమ‌ర్శ‌గా మారి.. క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. ఇటీవ‌ల కూడా బండి సంజ‌య్‌.. త్వ‌ర లోనే కాంగ్రెస్ పార్టీ క‌విత‌కు బెయిల్ ఇప్పిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా బండి చేసిన వ్యాఖ్య‌.. దుమారానికి దారి తీసింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి క విత సోద‌రుడు కేటీఆర్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. ''బండి ప్ర‌స్తుతం కేంద్ర స‌హాయ మంత్రిగా ఉన్నారు'' అంటూ.. గుర్తు చేశారు. ఆ స్థానంలో ఉన్న నాయ‌కుడికి ఇలా చిల్ల‌ర మాట‌లు త‌గ‌వ‌ని చుర‌క‌లంటించారు.

అంతేకాదు.. బండి చేసిన వ్యాఖ్య‌లు సుప్రీంకోర్టు తీర్పును ధిక్క‌రిస్తున్న‌ట్టుగా కూడా ఉన్నాయ‌ని చెప్పా రు. కాబ‌ట్టి.. బండి వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా సుప్రీంకోర్టు ధిక్క‌రణ‌గా భావించి.. నోటీసులు ఇవ్వాల‌ని కేటీ ఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా.. ఆది నుంచి కూడా క‌విత కేసు, బెయిల్‌.. రాజ‌కీయ వ‌స్తువుగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బీజేపీతో బీఆర్ ఎస్ విలీనం అవుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కాదు.. కాంగ్రెస్‌లోనే బీఆర్ ఎస్ క‌లిసి పోతుంద‌ని క‌విత‌కు బెయిల్ ఇప్పిస్తున్నార‌ని.. బీజేపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే.