Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిపై 'బండి'కి బెంగ ప‌ట్టుకుందే!

రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ మంత్రులే భావిస్తున్నారంటూ.. తాజాగా బండి వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:41 AM GMT
రేవంత్ రెడ్డిపై బండికి బెంగ ప‌ట్టుకుందే!
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్‌రెడ్డిపై.. బీజేపీ కేంద్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కు డు బండి సంజ‌య్‌కు బెంగ‌ప‌ట్టుకున్న‌ట్టుగా ఉంది. కాంగ్రెస్ నేత‌ల‌కు, రేవంత్ అభిమానుల‌కు కూడా రాని డౌట్లు.. బండికి వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న కొన్ని జాగ్ర‌త్తలు చెబుతున్నారు. సాధార‌ణంగా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారాలు ఆయ‌నే స్వ‌యంగా చూసుకోగ‌ల నేర్ప‌రి. ఎవ‌రూ ఆయ‌న‌కు రాజ‌కీయాల్లో స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేనంత‌గానే ముందుకు సాగుతున్నారు.

దాదాపు ఏడాది పాల‌న‌లో రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల నుంచి మంచి మార్కులే వేసుకున్నారు. అయితే.. ఒక్క హైడ్రా విష‌యంలో మాత్రం కొన్ని విమ‌ర్శ‌లు ఎలానూ త‌ప్ప‌వ‌నిఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పాల‌న ప‌రంగా రేవంత్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా మైన‌స్‌లులేవు. పైగా.. మంత్రులు కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నారు. పోనీ.. ఆయ‌న మాట విన‌క‌పోతే.. అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే.. రేవంత్‌ను వీరు కాదు క‌దా.. సీఎంగా ఎంపిక చేసింది!!

కానీ, బండి మాత్రం కాంగ్రెస్ మంత్రుల‌ను అడ్డు పెట్టుకుని రేవంత్‌పై తెగ బెంగ పెట్టేసుకున్న‌ట్టు క‌నిపి స్తోంది. రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ మంత్రులే భావిస్తున్నారంటూ.. తాజాగా బండి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేవంత్ త‌న ప్ర‌తి అడుగును జాగ్ర‌త్త‌గా వేయాల‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఇంత ప్రేమ ఆయ‌న‌కు ఎందుకో అర్ధం కావ‌డం లేదు. రేవంత్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దింపేయాలని `గోతికాడ నక్కల్లా` మంత్రులు ఉన్నారంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి అంత సీన్ మంత్రుల‌కు లేద‌న్న‌ది బండికి కూడా తెలుసు. అదే ఉంటే.. రేవంత్ స్థానంలో ఆ నేత‌లు ఎప్పుడో ఉండేవారు. కానీ, ఈ విష‌యాన్ని ఇప్పుడు అంత హైలెట్ ఎందుకు చేస్తున్నారంటే.. బండికి స‌బ్జెక్ట్ చిక్క‌డం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. పైగా.. కేంద్ర మంత్రిగా ఉండి..ఆయన చేస్తున్న‌ది కూడా ఏమీ లేదు. ఒక్క కంటోన్మెంట్ ప‌రిధిని మాత్ర‌మే త‌ప్పించ‌గ‌లిగారు. ఇంత‌కు మించి.. బండి తెలంగాణ‌కు చేసిందేమైనా ఆయ‌న చెప్పుకోవాలి. పైగా జ‌మిలి ఎన్నిక‌లు కూడా రానున్న నేప‌థ్యంలో బండి ముందుగానే తొంద‌ర‌ప‌డితే మంచిద‌ని అంటున్నారు.