Begin typing your search above and press return to search.

నాటి కేసీఆర్ సర్కారుపై బండి పేల్చిన బాంబ్!

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బండి.. తాజాగా కేసీఆర్ సర్కారు చేసిన తప్పులను చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   7 Sep 2024 4:04 AM GMT
నాటి కేసీఆర్ సర్కారుపై బండి పేల్చిన బాంబ్!
X

అధికారంలో ఉన్నన్ని రోజులు కేంద్రంలోని మోడీ సర్కారు తమకేమీ చేయలేదని.. ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదంటూ విరుచుకుపడిన కేసీఆర్ సర్కారు ఫెయిల్యూర్ మీద పెద్ద బాంబే పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బండి.. తాజాగా కేసీఆర్ సర్కారు చేసిన తప్పులను చెప్పుకొచ్చారు. అప్పట్లో కేంద్రానికి చెందిన రూ.1345 కోట్ల నిధులు ఉన్నాయని.. వాటిని వాడుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.

అయినప్పటికీ ఆ నిధుల్ని నాటి కేసీఆర్ సర్కారు వినియోగించుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు.. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం కేంద్ర మంత్రుల్ని పిలవలేదన్నారు. అంతేకాదు.. కేంద్ర మంత్రుల్ని కలవలేదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ సచివాలయానికి వెళ్లిన వైనం గురించి స్పందిస్తూ.. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సచివాలయానికి వెళ్లినట్లుగా పేర్కొన్నారు.

భారీ వర్షాలు.. వరదలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయినట్లుగా చెప్పిన బండి సంజయ్.. అన్ని అంశాలు కేంద్రం ద్రష్టిలో ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించిందని.. నివేదికల్ని పరిశీలించిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేస్తుందని పేర్కొన్నారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న బండి.. గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయటం ద్వారా.. కేసీఆర్ అండ్ కోను ఆత్మరక్షణలో పడేశారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సందర్భాల్లో కేంద్రం నుంచి సహాయం అందలేదని తరచూ వ్యాఖ్యానించే గులాబీ నేతల మాటలకు సమయం చూసి మరీ దెబ్బ కొట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. బండి చేసిన వ్యాఖ్యలకు గులాబీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.