Begin typing your search above and press return to search.

బీజేపీకి అదిరిపోయే షాకిచ్చిన బండి సంజ‌య్

వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివ్రుద్ధి చేసుకుంటున్నామ‌ని తెలిపిన బండి సంజ‌య్‌... కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్తాన‌ని హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 1:30 AM GMT
బీజేపీకి అదిరిపోయే షాకిచ్చిన బండి సంజ‌య్
X

బండి సంజ‌య్ కుమార్‌... తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌వారికే కాదు... రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకుంటున్న వారికి కూడా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని వ్య‌క్తి. హిందుత్వ వాదాన్ని వినిపించ‌డంలో ఏమాత్రం శ‌ష‌బిష‌లు లేకుండా, బీజేపీ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అనుస‌రించే త‌న విధానాల‌తో ఈ నేత తెలంగాణ‌లో పార్టీని ఊహించ‌ని రీతిలో బ‌లోపేతం చేశారు. అయితే, వివిధ కార‌ణాల వ‌ల్ల ఆయ‌న్ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించింది. అయిన‌ప్ప‌టికీ త‌న పంథా మార్చుకోకుండా ప్ర‌జ‌ల‌తో ఉండ‌టం, పార్టీకి న‌మ్మిన‌బంటుగా మారిన త‌రుణంలో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఎంపీగా గెలుపొందించ‌గా పార్టీ కీల‌క‌మైన‌ కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. అలాంటి బండి సంజ‌య్ బీజేపీకి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు.

త‌న‌దైన డైన‌మిజంతో, శ్రేణుల్లో ఉత్తేజం నింపే వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేరైన బండి సంజ‌య్‌... ఇక నుంచి అలాంటి వైఖ‌రికి ఫుల్ స్టాప్ పెట్టేయ‌నున్న‌ట్లు ప్ర‌కటించారు! త‌న ఇలాకా అయిన కరీంన‌గ‌ర్‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసిన సంజ‌య్ ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నానో కూడా వెల్ల‌డించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌, మేయర్ సునీల్ రావుతో కలిసి పలు పనులను, నూతనంగా నిర్మించిన 'ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్' ను కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చేసిన అభివృద్దే శాశ్వతంగా నిలిచిపోతుంద‌ని తెలిపారు.

వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివ్రుద్ధి చేసుకుంటున్నామ‌ని తెలిపిన బండి సంజ‌య్‌... కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్తాన‌ని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటామ‌ని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదని బండి సంజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్దే శాశ్వతంగా నిలిచిపోతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించ‌డ‌మే కాకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదని ప్ర‌క‌టించ‌డం హుందా రాజ‌కీయాల‌కు నాందిగా మారువుతుంద‌ని పలువురు అంచ‌నా వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న‌ప్ప‌టికీ జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానడం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం అని అంటున్నారు.