Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులోనూ కేసీఆర్ గోలేనా.. ఏందిది బండి?!

తాజాగా మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో సుమారు ప‌ది నిమిషాల‌కు పైగానే మాట్లాడిన బండి..

By:  Tupaki Desk   |   11 Aug 2023 2:45 AM GMT
పార్ల‌మెంటులోనూ కేసీఆర్ గోలేనా.. ఏందిది బండి?!
X

పార్ల‌మెంటులోని కీల‌క‌మైన లోక్‌స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం వ‌స్తే.. ప్ర‌జ‌లకు ఉప‌యోగ‌క‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావించాలి. వాటి గురించి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలి. త‌ద్వారా.. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయి.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించాలి. కానీ, తెలంగాణకు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మాత్రం.. ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా.. కేసీఆర్ గుర్తుకు వ‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో సుమారు ప‌ది నిమిషాల‌కు పైగానే మాట్లాడిన బండి.. రాష్ట్ర స‌మ‌స్య‌లుప్ర‌స్తావించ‌లేదు. రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు రావాల్సిన నిధులు, ప్రాజ‌క్టుల‌ను ప్ర‌స్తావించ‌లేదు. కేవ‌లం కేసీఆర్ ను ఆయ‌న కుటుంబాన్ని తిట్టి పోసేందుకు ఈ స‌మ‌యాన్ని వాడుకున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌తిప‌క్షాల‌కు ప‌లికిన హిత‌వు(లోక్‌స‌భ రాజ‌కీయ వేదిక కాదు.. ప్ర‌జాస‌మ‌స్య‌లను ప్ర‌స్తావించేవేదిక‌) మ‌రి బండికి వ‌ర్తించ‌దో ఏమో.. తెలియ‌దు.

లోక్‌సభలో బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుప డ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని ఓ గజినీ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే 'భ్రష్టాచార్ రాక్షస సమి తి' అని వ్యాఖ్యానించారు. ''కేసీఆర్‌.. ఖాసిం చంద్రశేఖర రజ్వీ'' అని అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. 'తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరా యంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?' అంటూ నామా నాగేశ్వ‌ర‌రావు, ఇత‌ర బీఆర్ ఎస్ ఎంపీల‌కు సవాల్ విసిరారు.