Begin typing your search above and press return to search.

పెగ్గు పెగ్గుకో వాగ్ధానం... కేసీఆర్ పై బండి కామెంట్స్ వైరల్!

ఇదే సమయంలో కేసీఆర్ కి కూడా మరో పేరుందని.. అది దుబాయ్ శేఖర్ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:36 AM GMT
పెగ్గు పెగ్గుకో వాగ్ధానం... కేసీఆర్  పై బండి కామెంట్స్  వైరల్!
X

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో పార్టీలన్నీ ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేడర్ లో జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మంలో "రైతు గోస-బీజేపీ భరోసా" సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అవును... కేసీఆర్ పేరు చెబితే అంతెత్తున లేచే బీజేపీ నేతల్లో బండి సంజయ్ ఒకరు! పైగా అది బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అనేసారికి.. ఆ దూకుడు మరింత పెరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ కుమారుడు పేరు మార్చారని... కేసీఆర్ పెగ్గు పెగ్గుకీ హామీలు ఇలా ఇస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తొలుత కేటీఆర్ పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని చెప్పిన బండి సంజయ్... కేసీఆర్ కు ఎన్టీఆర్ టిక్కెట్ ఇవ్వకపోయే సరికి, ఆయన మెప్పు పొందడం కోసం... అజయ్ రావు పేరు మార్చారని అన్నారు. ఫలితంగా కల్వకుంట్ల తారకరామారావు అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ కి కూడా మరో పేరుందని.. అది దుబాయ్ శేఖర్ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.

అనంతరం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి.. ఆ సమయంలో పెగ్గు పెగ్గుకీ హామీలు ఎలా మారతాయనేది ఆసక్తిగా చెప్పారు సంజయ్. ఇందులో భాగంగా... ఒక పెగ్ వేసిన అనంతరం ఇంటికో ఉద్యోగం అంటారని.. రెండు పెగ్గులు వేసి డబుల్ బెడ్రూం ఇళ్లు అంటారని ఎద్దేవా చేశారు బండి సంజయ్.

ఇక మూడో పెగ్గులో దళితులకు మూడెకరాల భూమి అంటాడని చెప్పిన సంజయ్... నాలుగో పెగ్గులో దళిత బంధు అంటారని అన్నారు. అనంతరం పరిస్థితి ఐదో పెగ్గుకి చేరే సరికి... పైన చెప్పినవి ఏమీ అనలేదని అంటాడు అంటూ బండి సంజయ్ షాకింగ్ సెటైర్లు వేశారు.

దీంతో... అలాంటి వ్యక్తిని సీఎం అని, అలాంటి వ్యక్తిని ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారు. అందుకే.. "మోడీ రాజ్యం" తరహాలో "రామరాజ్యం" మార్గదర్శకత్వంలో సుసంపన్నమైన భవిష్యత్తును ఊహించుకుంటూ, తెలంగాణ అభివృద్ధి కోసం "డబుల్ ఇంజన్ ప్రభుత్వం" వెనుక ప్రజలు నడవాలని ఆయన కోరారు.

అంతక ముందు... ఖమ్మం వెళుతూ మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో సంజయ్‌ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్యాన్సర్‌ కంటే కేసీఆరే డేంజర్‌ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆరెస్స్ కు ఓటు వేయొద్దని కోరారు!

ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌ పై అమిత్ షా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. కేసీఆర్ సర్కార్ కు నూకలు చెల్లాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అనేకమంది యువకులు ప్రాణత్యాగం చేశారని, కానీ బీఆరెస్స్ ప్రభుత్వం మాత్రం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని చెప్పిన అమిత్ షా... ముఖ్యమంత్రి భద్రాచలం వస్తారు కానీ, రాముడిని దర్శించుకోరని అన్నారు. దానికి గల కారణం... ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. భద్రాద్రి రాముడిని కూడా నిర్లక్ష్యం చేసి.. భక్తుల మనోభావాలు కేసీఆర్ దెబ్బతీశారని షా కీలక వ్యాఖ్యలు చేశారు!