గాడిద గుడ్డుకు గాడిద గుడ్డే కౌంటర్: బండి హాట్ కామెంట్స్
తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ''కాంగ్రెస్ బడ్జెట్‌లో ఏముంది.. గాడిద గుడ్డు!'' అని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 27 July 2024 10:17 AM GMT''8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది.. - గాడిదగుడ్డు'' -అంటూ రెండు రోజుల కిందట హైదరాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్దగా పట్టించుకోని బీజేపీ నేతలు.. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు బడ్జెట్పైనా.. ప్రస్తుతం తీసుకుంటున్న 57 వేల కోట్ల రూపాయల అప్పలపైనా (బడ్జెట్ లోనే చెప్పారు) 'గాడిద గుడ్డు' వ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ''కాంగ్రెస్ బడ్జెట్‌లో ఏముంది.. గాడిద గుడ్డు!'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ''బ్రోకర్ గాళ్లకు కమీషన్లు ఇచ్చి.. ఎక్కువ వడ్డీలకు వేల కోట్లు అప్పులు తెస్తున్నరు. ఇది కుట్ర కాదా. ఇదే కద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఏదో ఒక రకంగా అప్పులు తేవాలె. ప్రజలపై భారం రుద్దాలె అన్నట్టుగా ఉంది'' అన్నారు. రాష్ట్ర బడ్జటె్- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కూడా.. గాడిదగుడ్డేనని కౌంటర్ ఇచ్చారు.
''ఎవడివ్వమన్నడు నిన్ను ఆరు గ్యారెంటీలు. ఇచ్చినవ్. ఇప్పుడు అమలు చేయమంటే కేంద్రంపై ఏడుస్తున్నరు. కేంద్రం ఇచ్చిందా.. ఆరు గ్యారెంటీలు? కేంద్రంను ఎందుకు బద్నం చేస్తున్నరు'' అని బండి సీఎం రేవంత్ సర్కారును ఉద్దేశించి ప్రశ్నించారు. ''కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడస్తున్నట్లుంది. సీఎం తీరు తెలంగాణకు పెద్ద నష్టం. ముఖ్యమంత్రికి ముఖం చెల్లకనే నీతి ఆయోగ్ భేటీకి డుమ్మా కొట్టిండు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పెద్ద అవకాశవాదులు'' అని బండి విమర్శలు గుప్పించారు.