ప్రకాశ్ రాజ్ - నాగబాబు... బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?
అవును... పవన్ "హిందీ-తమిళనాడు" వ్యాఖ్యలు.. నాగబాబు చేసిన "ఖర్మ" వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 15 March 2025 2:16 PM ISTపిఠాపురంలో జరిగిన జనసేన "జయకేతనం" సభ అనంతరం ప్రధానంగా రెండు విషయాలు అత్యంత హాట్ టాపిక్ గా మారాయి! అందులో ఒకటి హిందీ భాషపై తమిళనాడును పవన్ నిలదీసిన విషయం కాగా.. మరొకటి.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల "ఖర్మ" అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు!
అవును... పవన్ "హిందీ-తమిళనాడు" వ్యాఖ్యలు.. నాగబాబు చేసిన "ఖర్మ" వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. నెట్టింట ఈ రెండు విషయాలపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ సమయంలో నాగబాబు చేసిన "ఖర్మ" వ్యాఖ్యలపై పెను దుమారమే రేగిందని అంటున్నారు. పవన్ తన గెలుపు బాధ్యతలు వర్మ చేతిలో పెట్టారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ఆ సమయంలో... పవన్ కల్యాణ్ గెలుపుకోసం వర్మ చాలా కష్టపడ్డారని.. పవన్ పోటీని తన పోటీగా భావించి ఫైట్ చేశారనేది పలువురు స్థానిక టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానుల మాటగా ఉంది! అలాంటి సమయంలో.. నాగబాబు చేసిన "ఖర్మ" వ్యాఖ్యలను పలువురు కృతజ్ఞత లేని వ్యాఖ్యలుగా చూస్తున్నారని నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి!
మరోపక్క హిందీ-తమిళనాడు అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్... "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం" అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్" అని ట్వీట్ చేశారు.
సరిగ్గా ఈ సమయంలో... "కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకారో స్పష్టంగా తెలియజేస్తుంది.. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి"! అని బండ్ల గణేష్ ఎక్స్ లో రాసుకొచ్చారు.
దీంతో... ఈ ట్వీట్ "మా" ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్థావిస్తూ... ప్రకాశ్ రాజ్ ని ఉద్దేశించే బండ్ల గణేష్ చేసి ఉంటారు అని కొంతమంది తమ అభిప్రాయపడుతుంటే... కామెంట్ సెక్షన్ లో మాత్రం.. ఇది నాగబాబును ఉద్దేశించి చేసినట్లుగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు! ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.