Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల.. బండ్ల గణేష్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈమేరకు రేవంత్ రెడ్డి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:13 AM GMT
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల.. బండ్ల గణేష్
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈమేరకు రేవంత్ రెడ్డి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదేళ్ల కల కావడంతో అందరు సంతోషిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోనే ఉండిపోయింది. ఎట్టకేలకు తన కలనెరవేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. తమ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి సంకేతాలు రావడంతో ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుడుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తన కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాలని తాను ఎన్నో కలలు కన్నానని గుర్తు చేసుకున్నారు. రాత్రి స్టేడియంలోనే నిద్రపోయి రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తానని తన మనసులోని మాట వెల్లడించాడు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారు. విరామం లేకుండా రాష్ట్రమంతా పర్యటించి ఓటర్లను ప్రభావితం చేశారు. దాని ఫలితమే కాంగ్రెస్ కు అధికారం దక్కింది. ఇలా రేవంత్ తన మాటలతో అందరిని పార్టీ వైపు తిప్పుకున్నారు. ఓటర్లలో భరోసా నింపారు. వారికి ఆరు హామీలు బాగా ప్రచారం చేసి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చారు. దీని కోసం అహర్నిశలు శ్రమించారు. వన్ మ్యాన్ ఆర్మీలాగా కష్టపడి పార్టీని విజయతీరాలకు చేర్చిన ఘనత ఆయనదే

మంత్రివర్గ కూర్పుపై ఫోకస్ పెడుతున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. అనుభవజ్ణుల మేళవింపుతో ప్రభుత్వం సజావుగా సాగేందుకు అవసరమయ్యే వనరులు సమకూర్చుకుంటున్నారు. చాలా ఏళ్ల తరువాత అధికారం దక్కడంతో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీని ముందుకు నడిపించి ప్రభుత్వ నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూసుకునేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజల్లో మంచి పట్టు సాధించాలని కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటే మంచి పాలన అందించాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీని కోసమే అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలన అందించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవడమే కర్తవ్యంగా భావిస్తున్నారు.