రేవంత్ కోసం బండ్ల గణేష్ ఫోన్... ప్రూఫ్ లు చూపిస్తున్న పాల్!
ప్రజాశాంతి పార్టీ (పీఎస్పీ) అధ్యక్షుడు కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) తెలంగాణ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Nov 2023 6:42 AM GMTప్రజాశాంతి పార్టీ (పీఎస్పీ) అధ్యక్షుడు కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) తెలంగాణ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపైఇ, వైఎస్సార్టీపీలు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయని ప్రకటించిన కొద్దిరోజులకే కేఏ పాల్ 12 మంది అభ్యర్తులతో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. 199 స్థానాల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నట్లు తెలిపారు. వాటికోసం 344 మంది రిక్వస్ట్స్ చేసుకున్నట్లు తెలిపారు!
ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుతామని.. తన పార్టీలో అన్ని వర్గాల వారికీ సమన్యాయం జరుగుతుందని చెబుతున్న కేఏ పాల్... తెలంగాణ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న ఇదే అన్నట్లుగా ఒక విషయం తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డిని సీఎం చేయమని తనకు దేశ విదేశాల నుంచి ఫోన్లు చేశారని కేఏ పాల్ తెలిపారు. వారిలో బండ్ల గణేష్ కూడా ఉన్నారని అన్నారు!
అవును... తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తనదిన రాజకీయంతో ఎంటరయ్యారు. ఈ క్రమంలో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు తనకు ఫోన్లు చేస్తున్నారని అన్నారు.
ఇందులో భాగంగా... 77 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని తెలిపిన కేఏ పాల్... ఇప్పుడు 12వ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అనేక మంది తనకు ఫోన్ కాల్స్ చేశారని తెలిపారు. ఇందులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారాని అన్నారు.
ఇదే క్రమంలో... అమెరికా నుంచి 16 మంది తనకు ఫోన్ చేశారని.. ఫోన్లు చేసిన వారిలో 16 మంది కమ్మ కమ్యూనిటీకి చెందిన నాయకులతోపాటు అమెరికాకు చెందిన ఒక సంస్థ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మొదలైనవారు ఉన్నారని చెప్పుకొచ్చారు పాల్. ఈ సందర్భంగా తనకు ఫోన్ చేసిన వారు.. తమకు ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ లు శత్రువులని ఫోన్ లో చెప్పినట్లు వెల్లడించారు.
అందువల్ల... చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని.. దానికి తాము వంద, వెయ్యి.. ఎన్నికోట్లయినా ఖర్చు పెడతామని ఫోన్ లో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో మొదటి కాల్ బండ్ల గణేష్ నుంచి వచ్చిందని చెప్పిన పాల్... అయితే ఆ గణేష్ పేరు వినడమే తప్ప ఆయనెవరో తనకు తెలియదని అన్నారు.
ఈ సందర్భంగా తనకు ఫోన్ చేసిన బండ్ల గణేష్... "నేను మీ ఫాలోవర్ ని, మీరంటే మాకు దైవం" అని అన్నారని చెప్పారు. అనంతరం... తనకు ఫోన్ చేసిన వారి నెంబర్స్, ఇన్ కమింగ్ కాల్స్ వివరాలను మీడియాకు వెల్లడించడం గమనార్హం. ఇప్పుడు ప్రూఫ్ లతో చూపిస్తున్న ఈ లిస్ట్ వైరల్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏమి జరుగుతుందనే చర్చ సీరియస్ గా మొదలైంది.
ఈ విమర్శల అనంతరం వైఎస్ షర్మిల, కోదండ రాం లపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనేది కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించిన ఆయన... షర్మిళ, కోదండరాం రెడ్డి కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని ముందే చెప్పానని పేర్కొన్నారు.