Begin typing your search above and press return to search.

రేవ్‌ పార్టీ.. పోలీస్‌ కమిషనర్‌ చెప్పిన సంచలన విషయాలు ఇవి!

హైదరాబాద్‌ లో రేవ్‌ పార్టీలపై పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేయడంతో బెంగళూరు శివార్లలో ఏర్పాటు చేశారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 7:59 PM GMT
రేవ్‌ పార్టీ.. పోలీస్‌ కమిషనర్‌ చెప్పిన సంచలన విషయాలు ఇవి!
X

బెంగళూరులో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘సన్‌ సెట్‌ టు సన్‌ రైజ్‌’ పేరిట ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఈ రేవ్‌ పార్టీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌ లో రేవ్‌ పార్టీలపై పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేయడంతో బెంగళూరు శివార్లలో ఏర్పాటు చేశారని అంటున్నారు. బెంగళూరు శివార్లో ఉన్న ఒక ఫామ్‌ హౌస్‌ లో ఈ పార్టీ జరిగింది.

కాగా ఈ రేవ్‌ పార్టీకి హాజరు కావడానికి భారీ ఎత్తున ఎంట్రీ ఫీజును నిర్దేశించారని చెబుతున్నారు. ఏకంగా రూ రెండు లక్షలు చొప్పున చెల్లించి ఈ పార్టీకి హాజరయ్యారని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ అంటున్నారు. ఇందులో మొత్తం 150 పాల్గొన్నారని.. ప్రతి ఒక్కరు రూ 2లక్షల చొప్పున ఎంట్రీ ఫీజుగా చెల్లించారని వివరించారు. ఇది కేవలం ఎంట్రీ ఫీజు మాత్రమేనని.. లోపలకు వెళ్లాక ఇంకా అదనపు సౌకర్యాలు కావాలంటే ఇంకా కొంత చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్‌ కావాలంటే అదనపు మొత్తం ఇవ్వాల్సిందేనని అంటున్నారు.

కాగా ఈ పార్టీకి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్‌ తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కాగా ఈ రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, బుల్లి తెర నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ ప్రముఖులెవరూ లేరని చెబుతుండటం గమనార్హం. సినీ నటులు కూడా కేవలం ఇద్దరేనని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే ఒక సినీ నటి తాను రేవ్‌ పార్టీలో లేనని.. తాను వేరే ఫామ్‌ హౌస్‌ లో చిల్‌ అవుతున్నట్టు తప్పుదోవ పట్టిస్తూ వీడియో విడుదల చేయడాన్ని కూడా పోలీసులు సీరియస్‌ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమెపైన ఇందుకు సంబంధించి కేసు పెట్టనున్నట్టు సమాచారం.

కాగా రేవ్‌ పార్టీ వ్యవహారంలో సహజంగానే పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి. గతంలో హైదరాబాద్‌ లో పలు సంఘటనల్లోనూ కీలక పాత్రధారులను, సినీ నటులను తప్పించారనే ఆరోపణలను పోలీసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బెంగళూరులో కూడా పోలీసులు కొందరిని తప్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో మొత్తం 150 మంది ఉండగా కొందరు ప్రముఖులను తప్పించారని అంటున్నారు. వారిని పట్టుకున్నచోటే వదిలిపెట్టేశారని తెలుస్తోంది. అలాగే కొందరి సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా.. వాటి గురించి ఎఫ్‌ఐఆర్‌ లో నమోదు చేయకుండా తిరిగి ఇచ్చేశారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.