Begin typing your search above and press return to search.

ఆ బైకుకు జరిమాలు ఎంత పడ్డాయో తెలుసా?

బెంగుళూరులో ఓ మహిళ ఏకంగా రూ. 1.36 లక్షల ఫైన్ లు పడేందుకు కారణమైంది. ఆమె పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో అంత పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు.

By:  Tupaki Desk   |   16 April 2024 8:41 AM GMT
ఆ బైకుకు జరిమాలు ఎంత పడ్డాయో తెలుసా?
X

కుక్క కంటే దాని తోకే పొడవుగా ఉందంటారు. కొన్ని సార్లు ఇది విచిత్రంగా అనిపించినా ఇందులో నిజం ఉంది అనిపిస్తుంది. మనం చేసే ఖర్చులకన్నా మన ఆదాయమే తక్కువగా ఉండటం సహజమే. ఇక్కడ ఓ బైక్ జరిమానాలు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. దాని ఖరీదు కంటే దానికి పడిన ఫైన్ లే ఎక్కువ. ఎంతో తెలిస్తే షాకే. అవి ఏకంగా రూ.1.36 లక్షల జరిమానాలు పడ్డాయంటే అతిశయోక్తి కాదు.

బెంగుళూరులో ఓ మహిళ ఏకంగా రూ. 1.36 లక్షల ఫైన్ లు పడేందుకు కారణమైంది. ఆమె పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో అంత పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా హెల్మెట్ ధరించకుండా పోవడంతో ఆమెకు జరిమానాలు పడ్డాయి. దీంతో ఆమె బైక్ పై పలు కామెంట్లు వస్తున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమె 277 సార్లు నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె బైక్ కు ఫైన్ లు అంతలా పెరిగాయి. ఆమె హోండా యాక్టివ్ వాహనం భారీ జరిమానాలకు గురైంది. దాని ఖరీదు కంటే ఫైన్ లే ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. దీనిపై నెటిజన్లు కూడా సంచలన కామెంట్లు పెడుతున్నారు. దాన్ని పో లీస్ స్టేషన్ లో పెట్టి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు.

నిర్లక్ష్యంగా ఉంటే దాని ఖరీదు ఇంతలా ఉంటుంది. ఆమె ఏమరుపాటే ఇంత నష్టానికి దారి తీసింది. హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ జరిమానాలు పెంచుకున్నారు. రాంగ్ రూట్లో వెళ్లితే కూడా ఫైన్ లు పెరుగుతాయి. ఇలా ఆమె ఏకంగా లక్షల వరకు పెంచుకోవడం అందరిలో ఆశ్చర్యం కలిగేలా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అని అనుకుంటున్నారు.

తన బండి నడిపితే ఎక్కడైనా పట్టుబడితే అంతే సంగతి. పోలీసులే దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆమెపై కూడా కేసులు నమోదు చేయడం గ్యారంటీ. దీంతో ఆమె బైకును ఏం చేస్తుంది? పోలీసులకు అప్పగిస్తుందా? లేక అలాగే నడుపుకుంటుందా? వేచి చూడాల్సిందే.