చిన్మయ వర్సెస్ హసీనా: మోడీకి పీఠముడి.. బంగ్లాదేశ్‌తో పెద్ద చిక్కు!
భారత్‌కు పొరుగున ఉన్న మిత్ర దేశం బంగ్లాదేశ్. నిన్న మొన్నటి వరకు సంబంధ బాంధవ్యాలు ఇరు దేశాల మధ్య బాగానే ఉన్నాయి.
By: Tupaki Desk | 26 Nov 2024 11:30 AM GMTభారత్‌కు పొరుగున ఉన్న మిత్ర దేశం బంగ్లాదేశ్. నిన్న మొన్నటి వరకు సంబంధ బాంధవ్యాలు ఇరు దేశాల మధ్య బాగానే ఉన్నాయి. కానీ, ఎప్పుడైతే.. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు ప్రారంభమైందో.. ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ప్రధానం బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడి రాత్రికి రాత్రి భారత్‌కు రావడం.. ఇక్కడే ఆశ్రయం పొందడం తెలిసిందే. కానీ, ఈ వ్యవహారాన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా పరిగణిస్తోంది.
హసీనాపై తీవ్ర అభియోగాలు ఉన్నాయని, ఆమెను అరెస్టు చేయాల్సి ఉందని బంగ్లాదేశ్ ఇప్పటికే పలు మార్లు భారత్‌కు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించాలని ఇది ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని కూడా బంగ్లాదేశ్ చెబుతోంది. కానీ, షేక్ హసీనా తండ్రి ముజిబర్ రెహమాన్ కాలం నుంచి కూడా భారత్‌కు-బంగ్లాదేశ్‌కు మధ్య స్నేహ పూర్వక సంబంధా లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ హసీనాను అప్పగించేందుకు ఇష్టపడడం లేదు.
ఈ కథ ఇలా ఉంటే.. ఇప్పుడు భారత్ కు చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ కృష్ణదాస్.. వ్యవహారం సంకటంగా మారింది. ఇస్కాన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఆరు మాసాల కిందటే బంగ్లా దేష్ కు వెళ్లారు. అక్కడే ఉంటూ.. ఇస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, గత నెలలో అనూహ్యంగా ఆయన ఢాకా విమానాశ్రయంలో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన బంగ్లాదేష్ ప్రభుత్వం.. కొన్ని రోజుల కిందట వెల్లడించింది.
దీనికి కారణం.. చిన్మయ స్వామి ఢాకాలో నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నది ప్రధాన అభియోగం, ఇదేసమయంలో ఆయన బంగ్లా జాతీయ జెండాపైనా విమర్శలు చేశారని అధికారు లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇప్పుడు ఆయనను అక్కడ నుంచి విడుదల చేయాలంటే.. ఇక్కడ భారత్‌లో ఉన్న హసీనాను మోడీ సర్కారు బంగ్లాకు అప్పగించాల్సి ఉంటుంది.
చిత్రం ఏంటంటే.. బంగ్లాలో అరెస్టయిన కృష్ణదాస్.. గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని, హిందూ వ్యాప్తికోసం బంగ్లాదేశ్‌కు వెళ్లారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చినట్టు అయింది. హసీనా కోసం కృష్ణదాస్ ను వదులుకుంటారా? లేక చిన్మయ కోసం హసీనాను అప్పగిస్తారా? అనేది చూడాలి.