Begin typing your search above and press return to search.

బంగ్లాలో విధ్వంసం మళ్లీ మొదలు... ఈసారి టార్గెట్ 'బంగబంధు' భవనం!

తాజాగా బంగ్లాదేశ్ లో హింసాగ్ని చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:40 AM GMT
బంగ్లాలో విధ్వంసం మళ్లీ మొదలు... ఈసారి టార్గెట్  బంగబంధు భవనం!
X

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా నివాసంపై జరిగిన దాడి, అనంతరం ఆమె దేశాన్ని విడిచి వెళ్లిపోవడం మొదలైన ఘటనలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బంగ్లాదేశ్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ‘బంగ్లాలో విధ్వంసం’ అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

అవును... బంగ్లాదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యానించినా, అవామీ లీగ్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, 'బంగబంధు'గా పేర్కొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై తాజాగా దాడి జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల జరిగిన కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా పదవి కోల్పోయిన షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా ప్రసగించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో... మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అమావీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు.

దీంతో... ఢాకాలో ఈ ఘటనలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో బంగబంధు భవనానికి నిప్పుపెట్టడం వైరల్ గా మారింది. అయితే... ఈ విషయంపైనా షేక్ హసీనా స్పందించారు. ఇందులో భాగంగా... "వారు భవనాన్ని కూల్చివేయగలరు కానీ చరిత్రను కాదు.. అది వారు గుర్తించుకోవాలి" అని వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో ఈ ఘటనలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన నిరసనకారులు... ఈ భవనం అధికారవాదానికి, ఫాసిజానికీ చిహ్నమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని వారు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా... షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సాయంతో నాడు పూర్తి చేశారు. అనంతరం 1975లో ఆయన అధికార నివాసంలో ఉండగానే సైన్యం దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో ఆయనతో పాటు కుటుంబంలోని మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆ దేశ చరిత్రలో పెద్ద మచ్చగా మిగిలిపోయింది!

అయితే.. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటంతో బ్రతికిపోయారు! ఇక ఈ ఘటన అనంతరం.. అవామీ లీగ్ పాలనలో ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చారు. బంగ్లా చరిత్రలో ఈ నివసం ఒక ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు తాజాగా ఆ బంగ్లాకు నిప్పు పెట్టారు!