Begin typing your search above and press return to search.

వైరల్ పిక్స్... ప్రధాని ఇంటి నుంచి బ్రాలు, చేపలు లూటీ!

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది

By:  Tupaki Desk   |   6 Aug 2024 7:14 AM GMT
వైరల్ పిక్స్... ప్రధాని ఇంటి నుంచి బ్రాలు, చేపలు లూటీ!
X

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. షేక్ ఖసీనా ప్రభుత్వం వైదొలిగిన సమయంలో... ఆమె బంగ్లాను వదిలి భారత్ కు వచ్చారు. అంతక ముందు ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చడంతో రాజీనామా చేయాలంటూ హసీనాకు సైన్యం 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. అనంతరం "గణభవన్" లూటీకి గురైంది!

అవును... ప్రధాని పదవి నుంచి వైదొలగాడినికి షేక్ హసీనాకు సైన్యం 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో... సైన్యం ఇచ్చిన అల్టిమెటంకు తగ్గొలిన హసీనా.. దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆమె అధికారిక నివాసం "గణభవన్"పై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు. ఈ సందర్భంగా చెతికి దొరికినవి దొరికినట్లు ఎత్తుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆందోళన కారులు ప్రధాని అధికారిక నివాసంలోని మంచాలపై పడుకుని కనిపించారు. ఈ సమయంలో కొంతమంది ఆ భవన్ లోని కుర్చీలను, సోఫాలను, చేపలను, బ్రా లనూ ఎత్తుకెళ్లడం సీసీ టీవీలో కనిపించింది! ఇదే సమయంలో... అవామీ లీగ్ పార్టీ కార్యలయానికీ ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాలను కూల్చేశారు!

ఈ సమయంలో ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించాయి. పలుప్రాంతాల్లో పోలీసు కార్యాలయాలకూ ఆందోళన కారులు నిప్పు పెట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఢాకాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పైనా దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో బంగ్లాలో సమాచార వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు హుటా హుటిన జరిగాయి.

ఇందులో భాగంగా... ఇంటర్నెట్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ పై పరిమితులను విధించారు. అయినప్పటికీ బంగ్లాలో పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా మారిపోయాయి. ఇలా బంగ్లాదేశ్ ఉక్కుమహిళగా పేరు పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇలా దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు రావడంతో ఒక్కసారిగా దేశం పరిస్థితి అధ్వాననంగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!