Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ లోని నిరసనల్లో మృతులపై ఐరాస సంచలన విషయాలు వెల్లడి!

అవును... గతకొన్ని రోజులుగా కుతకుత ఉడికిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కాస్త శాంతించినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Aug 2024 3:56 AM GMT
బంగ్లాదేశ్  లోని నిరసనల్లో మృతులపై  ఐరాస సంచలన విషయాలు వెల్లడి!
X

ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల ఫలితంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించడంతో పాటు ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకున్న పరిస్థితులు తలెత్తాయి.

ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు కాస్త ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో నిరసనలు, హింసపై ప్రాథమిక విశ్లేషణ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.

అవును... గతకొన్ని రోజులుగా కుతకుత ఉడికిపోయిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కాస్త శాంతించినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాలోని 13 జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వరుసగా కర్ఫ్యూలు విధించడం.. ఒకానొక దశలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లైన ఫేస్ బుక్, వాట్సప్, మెసెంజర్, ఇన్ స్టా గ్రామ్ లను మూసేసిన పరిస్థితి.

అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి కాస్త కూల్ అయ్యినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ లో జూలై 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ 400 మంది మృతిచెందినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో... ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన హింసాకాండలో సుమారు 250 మంది మరణించారని తెలిపింది.