"పుష్ప-2.0"లో షెకావత్ ఈయనే... జైల్లో ఉద్దేశ్యపూర్వకంగానే...?
అయితే తాజాగా అల్లు అర్జున్ ని ఓ సర్కిల్ ఇనిస్పెక్టర్ అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 14 Dec 2024 4:54 AM GMTఅల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, బెయిల్, విడుదల ఎపిసోడ్ దేశంలోని మొత్తం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కావడంతో జాతీయ స్థాయిలో ఈ విషయంపై రాజకీయ నాయకులు స్పందించారు. ఇందులో బీజేపీ ఎంపీలు.. కేంద్ర మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
"పుష్ప-2" సినిమాలో కేంద్రంలోని పెద్దలకు సోఫాలు పంపిన పుష్పరాజ్ క్యారెక్టర్ స్థాయిలో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారిందని అంటున్నారు. మరోపక్క... ఆ సినిమాలో ఎలాగైనా పుష్పరాజ్ ని అరెస్ట్ చేయాలని ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తారు. ఎలాగైనా పుష్పరాజ్ ను అరెస్ట్ చేయాలని, అతని పేరు చెప్పించాలని ప్రయత్నిస్తుంటాడు.
ఇక వేల టన్నుల ఎర్ర చంద్రనాన్ని విదేశాలకు తరలించే సమయంలో ఎపిసోడ్ అయితే వైరల్. దీంతో... పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా... వైల్డ్ ఫైరు అంటూ అల్లు అర్జున్ అస్సలు తగ్గేదేలే అనే సీన్ పీక్స్! అయితే... రియల్ గా మాత్రం పుష్పరాజ్ ని షెకావత్ అరెస్ట్ చేశారు! ఆయనే... సీఐ బానోతు రాజు నాయక్.
అవును... సినిమాలో పుష్పరాజ్ ను అరెస్ట్ చేయాలని ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవ్వగా... అయితే తాజాగా అల్లు అర్జున్ ని ఓ సర్కిల్ ఇనిస్పెక్టర్ అరెస్ట్ చేశారు. ఆయనే... సీఐ బానోతు రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ కు నాయక్ పెద్ద అభిమాని.
అల్లు అర్జున్ సినిమా విడుదలైతే కచ్చితంగా చూడటానికి ప్రయత్నించే సీఐ నాయక్... ఆయనతో ఓ ఫోటో దిగాలని అనుకునేవారంట. అయితే... తన అభిమాన నటుడిని స్వయంగా తానే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇది సదరు సీఐ కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు అని అంటున్నారు.
జైల్లో ఉద్దేశపూర్వకంగానే ఉంచారు!:
అల్లు అర్జున్ కు శుక్రవారం సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ.. రాత్రంతా జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తరుపు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వ్యుల్లో స్పష్టంగా చెప్పినా.. జైలు అధికారులు పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు!
ఈ నేపథ్యంలోనే ఉద్దేశ్యపూర్వకంగానే అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారని ఫైరవుతున్నారు! ఇది ఖచ్చితంగా కోర్టు దిక్కారనే అని అంటూ ఈ వ్యవహారంప కోర్టుకు వెళ్లే విషయమై అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీసులో న్యాయవాది నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డితో సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది!