Begin typing your search above and press return to search.

విడాకుల ప్రచారం నడుమ వాలంటైన్స్ డే పొస్ట్!

శుక్రవారం నాడు వేలంటైన్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ జంటలు సంబరాలు చేసుకోగా.. సింగిల్స్ వారి ప్రయత్నాలు వారు చేశారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2025 3:49 AM GMT
విడాకుల ప్రచారం నడుమ  వాలంటైన్స్  డే పొస్ట్!
X

శుక్రవారం నాడు వేలంటైన్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ జంటలు సంబరాలు చేసుకోగా.. సింగిల్స్ వారి ప్రయత్నాలు వారు చేశారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. గతకొన్ని రోజులుగా విడాకుల వార్తలు హల్ చేస్తున్న వేళ ఒబామా దంపతులు ఆన్ లైన్ వేదికగా స్పందించారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా "ఎక్స్" లు కాదని ప్రపంచానికి క్లారిటీ ఇచ్చారు!

అవును... గత కొన్ని రోజులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా దంపతుల విడాకులకు సంబంధించిన ఊహాగాణాలు ఇంటర్నేషనల్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ప్రేమికుల దినోత్సవం నాడు ఇరువురూ తమ బంధంపైనా, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ పైనా క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా... "ముప్పై రెండు సంవత్సరాలు కలిసి గడిపాము.. ఇప్పటికీ నువ్వు నా ఊపిరి.. హ్యాపీ వాలంటైన్స్ డే, మిచెల్ ఒబామా" అని మాజీ అధ్యక్షుడు తన భార్య మిచెల్ ఒబామాతో ఉన్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదే సమయంలో.. ఇదే స్థాయిలో మిచెల్ ఒబామా కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా... "నేను ఎల్లప్పుడూ నమ్మగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే.. అది నువ్వే బరక్ ఒబామా. నువ్వే నా రాక్.. ఎప్పుడు ఉన్నావు.. ఉంటావు.. హ్యాపీ వాలంటైన్స్ డే హనీ!" అని ప్రతిస్పందించారు. దీంతో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరి విడాకులకు సంబంధించిన ప్రచారానికి చెక్ పెట్టినట్లయ్యిందని అంటున్నారు.

కాగా... అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా గైర్హాజరవ్వడం.. అదేవిధంగా, గత నెలలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదనే వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో... ఒబామా దంపతుల మధ్య వైవాహిక విభేదాలు తలెత్తాయనే ఊహాగాణాలు మరింత తీవ్రమైన సంగతి తెలిసిందే.

అయితే... ఈ ప్రచారంపై అటు బరక్ కానీ, ఇటు మిచెల్ కానీ నేరుగా ప్రస్థావించలేదు. ఈ క్రమంలో ఈ జంట చివరిసారిగా డిసెంబర్ 2024న లాస్ ఏంజిల్స్ లో విందుకోసం ఒక్కటిగా బయట కనిపించారు. ఆ తర్వాత నుంచి ప్రచారం తెరపైకి రాగా.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ పుకార్లకు తెరపడినట్లయ్యింది!