వీడియో వైరల్... బార్ వద్ద ఫైట్ అంటే అమెరికాలో అయినా అంతే..?
ఒక బార్ బయట పౌరులు - మెరైన్లు కొట్టుకున్న సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ..
By: Tupaki Desk | 22 Nov 2023 3:31 AM GMTఒక బార్ బయట పౌరులు - మెరైన్లు కొట్టుకున్న సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ.. మొదలైంది మాత్రం ఒక మహిళతో అని ప్రాథమిక సమాచారం! బార్ కి వచ్చిన ఒక మహిళ.. అక్కడున్న మెరైన్ తో చేసిన ప్రవర్తన ఈ రచ్చకు కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
అవును... అమెరికాలోని ఓ బార్ బయట కొందరు పౌరులు - మెరైన్లకు మధ్య కొట్లాట జరిగింది. ఈ సమయంలో... బార్ కు వచ్చిన ఒక మహిళ అక్కడున్న ఓ మెరైన్ ఫోన్ ను నేలకేసి కొట్టడంతో ఈ పరిణామం చోటు చేసుకొందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు... పౌరులకే సూచనలు చేస్తుండటం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... కొందరు సిటిజెన్లు తాజాగా టెక్సాస్ లోని నైట్ క్లబ్ కి వెళ్లారు. ఆ సమయంలో బార్ ఒయట మెరైన్ బృందం నిలబడి ఉంది. ఈ సమయంలో అక్కడున్న ఒక అధికారితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. అనంతరం ఆ ఆధికారి ఫోన్ ను లాక్కొని నేలకేసి కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవ్వగా... అంతలో ఓ వ్యక్తి తగుదునమ్మా అంటూ వచ్చి సదరు అధికారిపై చేయి చేసుకున్నాడు.
దీంతో... వెంటనే అక్కడున్న అధికారులంతా వచ్చి అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మెరైన్లు, పౌరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకొంది. ఈ గొడవ ఏ స్థాయిలో జరిగిందంటే... రోడ్డుపై పడి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేటంతగా! దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ముందుగా అధికారిపై దాడిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఈ సందర్భంగా పౌరులకు పలు సూచనలు చేశారు. ఇది సరైన చర్య కాదని.. మన సాయుధ దళాలను మనమే గౌరవించుకోవాలని సూచించారు. ఇది సరైన చర్య కాదని అంటున్నారు. మరికొంతమంది మాత్రం... లోపల నాలుగు చుక్కలు పడితే అమెరికా అయినా అంతే..! అని సెటైర్స్ వేస్తున్నారు!