Begin typing your search above and press return to search.

ఏడడుగుల 'బ్యారన్'..? ట్రంప్ కుమారుడు మహా పొడగరి..

ఇప్పుడు 18 ఏళ్లకే 6.9 అడుగుల ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుతం న్యూయార్ యూనివర్సిటీలో చదువుతున్న బ్యారన్ మరి కాస్త ఎదిగినా ఏడు అడుగులకు చేరతాడు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 11:27 AM GMT
ఏడడుగుల బ్యారన్..? ట్రంప్ కుమారుడు మహా పొడగరి..
X

ఎవరైనా ఆరడుగులు ఉంటేనే అబ్బో అని అందరూ వారికేసి చూస్తుంటాం.. ఆరున్నర అడుగులు ఉంటే వామ్మో ఏం హైట్ అని అంటుంటాం.. అలాంటిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారన్ ట్రంప్ ఏకంగా 6.9 అడుగుల ఎత్తు ఉన్నాడు. తండ్రి మరోసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా బ్యారన్ గత ఏడాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు అయిన నేపథ్యంలో.. బ్యారన్ గురించి మాట్లాడుకుంటున్నారు.

సరిగ్గా 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పడు బ్యారన్ వయసు కేవలం పదేళ్లు. అయితే, అప్పటికే అతడు సాధారణం మించి ఎత్తు ఉన్నాడు. ఇప్పుడు 18 ఏళ్లకే 6.9 అడుగుల ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుతం న్యూయార్ యూనివర్సిటీలో చదువుతున్న బ్యారన్ మరి కాస్త ఎదిగినా ఏడు అడుగులకు చేరతాడు.

సాధారణంగా ఎక్కువ శాతం అబ్బాయిలు 18వ సంవత్సరం వచ్చే వరకు ఎదుగుతారు. కొద్దిమంది మాత్రం 20వ ఏడు వచ్చేవరకు ఎదుగుతూనే ఉంటారు. మరి బ్యారన్ మరో రెండేళ్లు కూడా ఎత్తు ఎదిగితే ఏడు అడుగులకు చేరి మహా పొడగరి కావడం ఖాయం.

డొనాల్డ్ ట్రంప్-మెలానియాల కుమారుడైన బ్యారన్.. చకచకా ఎదగడం (రాజకీయాల్లో కాదు ఎత్తులో) అందరినీ ఆశ్చర్యపరిచింది. 2006 మార్చి 20న పుట్టిన బ్యారన్ తొలినుంచీ పొడగరే అనుకోవాలేమో..? ఎందుకంటే.. అటుఇటు పదేళ్లు ఉన్నప్పుడు అంటే.. 2017 నాటికి, అతడు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తులో ఉన్నాడు. ఆయన తల్లి మెలానియా ట్రంప్‌ కూడా ఇదే హైట్ లో ఉంటారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌ లోని ఆక్స్‌ బ్రిడ్జ్ అకాడమీ నుంచి గత ఏడాది హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు బ్యారన్. అప్పటికే అతడు 6 అడుగుల 7 అంగుళాలకు చేరాడు.

డొనాల్డ్ ట్రంప్.. తన కుమారుడు బ్యారన్ ఎత్తు గురించి కొంత గర్వంగా కొంత అసూయగా చెబుతుంటారు. 6.9 అడుగులు ఉన్న అతడిని బాస్కెట్‌ బాల్‌ లో ప్రవేశపెట్టాలనుకున్నా సాధ్యం కాలేదని వివరించారు. బ్యారన్‌ పక్కన నిల్చొని ఫొటో దిగనని జోక్ చేశారు.

అమెరికన్లు విపరీతంగా ఆరాధించే క్రీడ బాస్కెట్ బాల్. మన ఐపీఎల్ లాగా అక్కడ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) బాగా పాపులర్. ఇందులో సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్‌. ఇతడు కూడా 6 అడుగుల 9 అంగుళాల పొడగరి. ఇప్పుడు బ్యారన్ ట్రంప్ లెబ్రాన్ జేమ్స్ ను సమం చేస్తున్నాడు.