Begin typing your search above and press return to search.

బర్రెలక్కకు వచ్చింది తక్కువ... వాళ్లకు వచ్చింది ఎక్కువ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క అలియాస్ శిరీష ఎంత పాపులర్ అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:30 PM GMT
బర్రెలక్కకు వచ్చింది తక్కువ... వాళ్లకు వచ్చింది ఎక్కువ!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క అలియాస్ శిరీష ఎంత పాపులర్ అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క పోటీచేసింది. గెలుపోటముల సంగతి కాసేపు పక్కనబెడితే ఆమె చూపించిన తెగువను యువత అంతా స్ఫూర్తిగా తీసుకోవాలని చాలా మంది మేధావులు సూచించారు.. ఆమెను అభినందించారు. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం అనే అంశంతో సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన బర్రెలక్క... ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను అభినందిస్తూ పలువురు మాట సాయం, మరికొంతమంది నోటు సాయం కూడా చేశారని వార్తలొచ్చాయి. ఈ సమయంలో ఆమె ఎందరికో ఆదర్శం అంటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం అభినందించారు.

ఇదే క్రమంలో ఆమెకు ఆర్థికంగా బలమైన మద్దతు లభించిందనే చర్చ నడిచిన నేపథ్యంలో... బర్రెలక్క ఈ ఎన్నికల సమయంలో సుమారు 20 లక్షల రూపాయలు దక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెకు వచ్చిన అంత డబ్బు ఏమైపోయింది అనే చర్చ నెట్టింట జరిగింది! ఇదే సమయంలో ఆమెతో పాటు ఉన్న వారు కూడా డబ్బు సంపాదించారా అనే అనుమానాలు కూడా ఆన్ లైన్ వేదికగా చర్చనీయాంశం అయ్యాయి.

మరోపక్క ఎన్నికల సమయంలో నెట్టింట ఫుల్ ఫేమస్ అయిన బర్రెలక్క పేరుతో యూట్యూబర్లు కూడా పెద్ద మొత్తంలో సంపాదించారనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు లేవనెత్తారు. ఈ క్రమంలో... బర్రెలక్క సంపాదించిన దానికంటే వారు ఎక్కువగా సంపాదించి ఉండొచ్చనే చర్చ కూడా నెట్టింట జరిగింది. దీనికి ప్రధాన కారణం... అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెజారిటీ యూట్యూబర్లు ఆమెపై కథనాల మీద కథనాలు ప్రసారం చేశారు!

ఇక ఆమె ఎన్నికల ప్రచార సమయంలోనూ, సమావేశాలలో ప్రసంగాలను యూట్యూబర్లు ప్రత్యేకంగా ప్రసారం చేయడం... తెలుగు ఎన్నారైలు కూడా ఆమెను ఎక్కువగా ఫాలో అవ్వడంతో బర్రెలక్క పేరు చెప్పి తెలంగాణలో యూట్యూబర్స్ సంపాదన కూడా భారీగానే ఉండి ఉండొచ్చని అంటున్నారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది. మరి... రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ బర్రెలక్క పోటీ చేస్తారా.. చేస్తే ఏ స్థానం నుంచి పోటీచేస్తారు అనే చర్చ కూడా మొదలైంది.

కాగా... ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బర్రెలక్క... 5,754 ఓట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.