వైసీపీ చేతిలో బీసీ ఆయుధం...టీడీపీకి నో చాన్స్...!?
ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడాకికి తారక మంత్రాన్ని వైసీపీ కనుగొంది. బీసీ నినాదంతో ఈసారి ఎన్నికలు ఎదుర్కోవాలని చూస్తోంది. బీ
By: Tupaki Desk | 12 Dec 2023 3:59 PM GMTఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడాకికి తారక మంత్రాన్ని వైసీపీ కనుగొంది. బీసీ నినాదంతో ఈసారి ఎన్నికలు ఎదుర్కోవాలని చూస్తోంది. బీసీలు ఏపీ జనాభాలో చూస్తే ఏకంగా యాభై శాతానికి పైగా ఉన్నారు. వారికి జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో సీట్లు అయితే ఇప్పటిదాకా దక్కలేదు అన్నది వాస్తవం. అంటే మొత్తం ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే అందులో 85 దాకా సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే అనేక రాజకీయ వత్తిడులు ఎపుడూ జాతీయ ప్రాంతీయ పార్టీలను కట్టడి చేస్తున్నాయి. తెలుగుదేశం బీసీల పార్టీగా ముద్ర పడింది. కానీ ఆ పార్టీ కూడా దామాషా ప్రాతిపదికన సీట్లు అయితే ఇవ్వలేకపోయింది. కానీ ఎక్కువగా ఇచ్చింది. ఇపుడు బీసీ బ్రాండ్ ఇమేజ్ ని తన సొంతం చేసుకోవాలని వైసీపీ ఉత్సాహపడుతోంది.
ఏపీలో 2024లో జరిగే ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. పొత్తులతో టీడీపీ దూకుడు చేస్తోంది. ఏపీలో బలమైన కాపు సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే ఈసారి సీఎం పీఠం తమదే అని టీడీపీ భావిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు కూడా అందులో భాగమే. దాంతో కాపు ఓట్ల విషయంలో ఎవరి షేర్ ఏంటి అన్న దాని మీద కొంత గందరగోళం అయితే ఉంది.
మరీ ముఖ్యంగా చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఒటు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఒక అంచనాలు అయితే ఉన్నాయి. దాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు వైసీపీ బీసీ నినాదాన్ని ఎంచుకుంటోంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ. అదే విధంగా ఎస్సీలు కూడా ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు.
దాంతో సామాజిక సాధికారిత అన్న స్లోగన్ తో వైసీపీ గోదావరి జిల్లాలతో పాటు ఏపీలోనే కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతోంది. ఇక బీసీలకు తామే పూర్తి స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు రాజ్యాంగపరమైన అవకాశాలు ఇస్తున్నామని క్లెయిం చేసుకుంటూ వస్తున్న వైసీపీ దానికి మరింత పదును పెట్టి ఆచరణలోకి తీసుకుని రావాలని చూస్తోంది.
ఈసారి ఎవరూ ఊహించనంత ఎక్కువగా బీసీలకు వైసీపీ టికెట్లు ఇస్తుందని అంటున్నారు. దాంతో బీసీ పార్టీగా టీడీపీని పక్కకు తోసి ఆ ప్లేస్ ని వైసీపీ ఆక్రమించేందుకు అన్ని విధాలుగా అవకాశాలను సొంతం చేసుకుంటుందని అంటున్నారు. అవసరం అయితే ఈసారి ఓసీ సీట్లలో సైతం బీసీలకే టికెట్లు ఇవ్వడం ద్వారా ఏపీ రాజకీయ సామాజిక చరిత్రలో ఎవరూ ఆలోచించని సరికొత్త ప్రయోగానికి వైసీపీ సిద్ధపడుతోంది అని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ అమ్ముఇల పొదిలో బీసీ అస్త్రం ఉందని అంటున్నారు. ఇక టీడీపీకి ఇపుడు ఇది పెను సవాల్ గా మారుతుంది అని అంటున్నారు. టీడీపీలో చూస్తే పొత్తులు ఉన్నాయి. అలాగే అనేక కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి అనేక వత్తిడులు ఉంటాయి. అంగబలం అర్ధబలం ఇతర లెక్కలు సరిచూసుకుని అభ్యర్ధుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇదంతా టీడీపీకి కత్తి మీద సాముగా ఉంటుంది.
అందుకే అన్ని విధాలుగా ఆలోచించే వైసీపీ బీసీ నినాదాన్ని సరైన టైం లో అందుకుంది అని అంటున్నారు. ఈ పరిణామంతో టీడీపీ కూడా ఇపుడు కార్నర్ అయ్యేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ రాజకీయ వ్యూహాలను టీడీపీ ఏ విధంగా తట్టుకుని ముందుకు సాగుతుందో.