Begin typing your search above and press return to search.

బేగంపేట్ లో విమాన ప్రమాదం... రేవంత్ పర్యటనకు ముందు బిగ్ షాక్!

ఇందులో భాగంగా.. ఓ శిక్షణ విమానం తిరిగి ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   6 Feb 2025 2:24 PM GMT
బేగంపేట్ లో విమాన ప్రమాదం... రేవంత్ పర్యటనకు ముందు బిగ్ షాక్!
X

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో తాజాగా ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా.. ఓ శిక్షణ విమానం తిరిగి ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో.. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానం రన్ వే దెబ్బతిన్నట్లు చెబుతున్నారు.

అవును... హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఓ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొట్టిన విమానం తిరిగి ల్యాండ్ అవుతుండగా.. ఎయిర్ క్రాఫ్ట్ అదుపు తప్పింది. ఈ సమయంలో రన్ వే పై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో పాటు ఆ విమానం ముందు భాగం రన్ వేను తాకినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.

దీనికి సంబంధించిన కొంతమంది ఫోటోలు, వీడియోలు తీయడంతో అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ ప్రమాదంలో విమానంలోని ట్రైనీ పైలట్ సురక్షితంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రన్ వే మాత్రం కొంతమేర దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో.. తక్షణమే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆ సంగతి అలా ఉంటే... ఈ విమానాశ్రయం నుంచి మరికొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా... ఈ సమయంలో విమాన ప్రమాదం జరిగి, రన్ వే దెబ్బతినడంతో అధికారులు అప్రమత్తమయ్యారని అంటున్నారు. దీంతో.. సీఎం పర్యటన కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే... ఈ ప్రమాధం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆ ప్రమాదం వల్ల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లే విమాన ప్రయాణం ఆలస్యం అవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు!