Begin typing your search above and press return to search.

లోకల్ ట్రైన్ లో బెల్లీ డ్యాన్స్... వీడియో & కామెంట్స్ వైరల్!

ముంబై లోకల్‌ ట్రైన్ లో ఓ అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 5:26 AM GMT
లోకల్  ట్రైన్  లో బెల్లీ డ్యాన్స్... వీడియో & కామెంట్స్  వైరల్!
X

సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండియన్ ట్రైన్స్ లో జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో బెల్లీ డ్యాన్స్ చేసిన యువతి వీడియో వైరల్ అవుతుంది.

అవును... ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్స్ లో బహిరంగ ముద్దులు, అసభ్యకరమైన పనులకు సంబంధించిన సంఘటనలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలకంటే వాటికి నెటిజన్లు పెట్టే కామెంట్స్ మరింత వైరల్ అవుతుంటాయి. ఈ సమయంలో అలాంటి సంఘటనే తాజాగా వైరల్ అవుతుంది.

ఢిల్లీ మెట్రో మాదిరిగానే ముంబై లోకల్ రైళ్లు కూడా రీళ్లు తయారు చేసుకునే వేదికగా మారిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ముంబై లోకల్‌ ట్రైన్ లో ఓ అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. శాండ్‌ హర్స్ట్ రోడ్ – మస్జిద్ స్టేషన్‌ ల మధ్య తీసినట్లుగా ఈ వీడియో ఉందని తెలుస్తుంది.

అయితే ఈ వీడియోపై వెలుగు చూస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ముంబై పోలీసులు కూడా స్పందించి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ముంబై రైల్వే పోలీసులను కోరారు.

"ఈ సందర్భంగా... ఆమెను వెంటనే అరెస్టు చేయాలి. అప్పుడు ఆ విషయం ఇతరులకు బలమైన సందేశం అవుతుంది. ఫలితంగా ఇకపై దీన్ని చేయడానికి ఎవరూ సాహసించరు" అని ఒకరు కామెంట్ చేయగా... "ముంబైలో డ్యాన్స్ చేయడానికి ఇంత పెద్ద స్థలం ఉన్నందుకు లక్కీ..." మరో వ్యక్తి సరదాగా స్పందించాడు.