టీడీపీ హ్యాట్రిక్ హీరో బెందాళం.. రాజకీయ గందరగోళం.. !
టిడిపి ఆవిర్భావం నుంచి ఈయన తండ్రి దివంగత బెందాళం ప్రకాష్ చురుకైన నాయకుడుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 20 Nov 2024 10:30 AM GMTబెందాళం అశోక్. కీలకమైన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలుపు గుర్రం ఎక్కారు. దాదాపు 12 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఈయన ఇచ్ఛాపురం నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నా రు. టిడిపి ఆవిర్భావం నుంచి ఈయన తండ్రి దివంగత బెందాళం ప్రకాష్ చురుకైన నాయకుడుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు.
గతంలో మంత్రి పదవి కళింగ సామాజికవర్గానికి వస్తుందనుకుంటే చివరి నిమిషంలో పార్టీలోని పెద్దలే కొందరు తప్పించారన్నది బహిరంగ రహస్యం. పోటీ వాతావరణం సృష్టించడంతో కళింగ సామాజికవర్గా నికి ఈ పదవి దక్కకుండాపోయింది. ఇక, ఇప్పుడు బెందాళం పరిస్థితి మరింత గందరగోళంలో పడిపో యిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రకటించిన 50 నామినేటెడ్ పదవుల్లో రెండు తమకు ఇవ్వాలని ఈయన ముందుగానే పార్టీ చీఫ్.. పల్లా శ్రీనివాసరావును ఒప్పించారు.
దీనికి పల్లా కూడా ఓకే చెప్పారు. జాబితాను కూడా పంపించమని కోరగా.. ఆరుగురు అత్యంత కీలక నాయ కుల పేర్లతో జాబితాను ఇచ్చారు. కానీ, ఒక్కరికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో చోటు దక్కలేదు. దీంతో బెందాళం చుట్టూ.. ఇప్పుడు కార్యకర్తలు, అనుచరులు తిరుగుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తు న్నారు. మరోవైపు అంతర్గత కుమ్ములాటలు కూడా ఎక్కువగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో నామినేటెడ్ పదవులతో సరిదిద్దాలని భావించారు.
కానీ, బెందాళం పంపించిన జాబితా ఏమైందో కూడా తెలియకుండా పోవడం.. తాను చెప్పిన వారిని పక్క న పెట్టడంతో బెందాళం వారికి నచ్చ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు తన వర్గాన్ని శాంత పరిచేందుకు తాజాగా ఆయన వన భోజనాల పేరుతోకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా.. పెద్దగా స్పందన అయితే కనిపించలేదు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని.. మనకు కూడా ప్రాదాన్యం దక్కుతుందని బెందాళం చెప్పినా..నాయకులు, కార్యకర్తలు పెదవి విరిచారు. దీంతో బెందాళం దీనిపై ఏదో ఒకటి తేల్చుకోవాలని.. ప్రస్తుత అసెంబ్లీసమావేశాల సమయంలో సీఎంను కలవాలని నిర్ణయించుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.