Begin typing your search above and press return to search.

ట్రైలర్ చూపించిన ఆటోవాలా... 'స్టార్టప్ ఐడియా'కు బిగ్ రెస్పాన్స్!

వివరాళ్లోకి వెళ్తే... తన స్టార్టప్ కు నిధులు సమకూర్చేందుకు బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన చేశారు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 3:51 AM GMT
ట్రైలర్  చూపించిన ఆటోవాలా... స్టార్టప్  ఐడియాకు బిగ్  రెస్పాన్స్!
X

ఏ ఒక్కరి సొత్తూ కాదు టాలెంట్ అంటారు.. టాలెంట్ కు వారూ వీరు అనే తారతమ్యాలు ఏమీ ఉండవని మరిచిపోతుంటారు చాలా మంది అనాలోచితమైన ఆలోచన కలిగినవారు. కానీ.. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని.. అసలు మాణిక్యాలన్నీ తొలుత మట్టినుంచే పుడతాయనే లాజిక్ మిస్సవుతుంటారు. అలాంటివారికి మరోసారి కనువిప్పు కలిగించాడు ఓ ఆటోవాలా!

అవును... ఈ రోజుల్లో చాలా మంది సరికొత్త ఆలోచనలతో, వ్యూహాత్మక అంశాలతో "స్టార్టప్"లు మొదలుపెడుతున్నారు. ఈ సమయంలో కొంతమందికి పెట్టుబడి పెట్టేవారు కుటుంబంలోనే దొరికితే, మరికొంతమందికి పలువురు బిజినెస్ మేన్ లు సాయం చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం పెట్టుబడుల కోసం విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా!

వివరాళ్లోకి వెళ్తే... తన స్టార్టప్ కు నిధులు సమకూర్చేందుకు బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన చేశారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తన వ్యాపార ఆలోచనల గురించి చర్చించడానికి తన ఆటోలో ప్రయాణించే వారిని ఆహ్వానిస్తూ తన సీటు వెనుక ఓ పోస్టరు ను ఉంచాడు.

ఆ పోస్టర్ లో... "హాయ్ ప్యాసింజర్.. నా పేరు శామ్యూల్ క్రిస్టీ. నేను స్టార్టప్ బిజినెస్ ఐడియా కోసం నిధులను సేకరించాలని చూస్తున్న గ్రాడ్యుయేట్ ని.. మీకు ఆసక్తి ఉంటే దయచేసి నాతో మాట్లాడండి" అని రాసి ఉంది. దీంతో.. ఈ ఆలోచనే వినూత్నంగా ఉందని.. ఇది మనోడి చూపించిన చిన్న ట్రైలర్ గా భావించొచ్చని అంటున్నారు నెటిజన్లు!

ఈ నేపథ్యంలో... అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు శామ్యూల్ క్రిస్టీని, అతని ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా అతని పోస్టర్ కు వస్తోన్న రెస్పాన్స్ బాగుందని.. కచ్చితంగా అనుకున్నది జరుగుతుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా... ఈ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇతడి ఆలోచనను ఎవరైనా ఇన్వెస్టర్లు వినాలని కోరుకుంటున్నారు! మరికొంతమంది ఆ ఐడియా వినడానికైనా బెంగళూరు వెళ్లి ఆ ఆటో ఎక్కాలని.. నచ్చితే పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అని కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు!