Begin typing your search above and press return to search.

అద్దె ఇంట్లో ఉండే ఆ అధికారి ఇంటిని తనిఖీ చేస్తే.. గోతాల్లో నోట్ల కట్టలు

గౌరవప్రదమైన స్థానంలో జాబ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గురించి తాజాగా వెలుగు చూసిన వాస్తవాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

By:  Tupaki Desk   |   24 Jan 2025 7:30 AM GMT
అద్దె ఇంట్లో ఉండే ఆ అధికారి ఇంటిని తనిఖీ చేస్తే.. గోతాల్లో నోట్ల కట్టలు
X

గౌరవప్రదమైన స్థానంలో జాబ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి గురించి తాజాగా వెలుగు చూసిన వాస్తవాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. బిహార్ లో వెలుగు చూసిన ఈ అరాచక అధికారి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంలనంగా మారింది. అద్దె ఇంట్లో ఉంటూ.. భారీగా చేపట్టిన అవినీతి కార్యకలాపాలకు నిదర్శనంగా గోతాల్లో దాచి ఉంచిన నోట్ల కట్టలు బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

బిహార్ లోని బెట్టియ జిల్లాకు చెందిన డీఈవో రజనీకాంత్ ప్రవీణ్ అనే ఒక అధికారి ఉన్నారు. ఆయన నివాసం ఒక అద్దె ఇంట్లో. కానీ.. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు. దీంతో.. అతడి ఇంటిని సోదాలు చేసేందుకు వెళ్లారు. అద్దె ఇంట్లో ఉండే అధికారి ఇంట్లో తనిఖీలా? ఏమైనా దొరుకుతాయా? అన్న సందేహాం ఇంటికి వెళ్లారు. అనుకున్నట్లే తనిఖీల్లో భాగంగా ఏమీ దొరకలేదు. అదే ఇంట్లో ఒక మూలన గుట్టగా పెట్టి ఉన్న గోతాల బ్యాగులు కనిపించాయి.

రైసు బ్యాగుల్లో ఏదో వస్తువుల్ని నింపి ఉంటారన్న ఉద్దేశంతో తనిఖీకి వెళ్లిన విజిలెన్స్ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఏమీ దొరకని నేపథ్యంలో ఆ గోతాల్లో ఏం ఉన్నాయా? అన్న సందేహంతో వాటిని విప్పి చూసి అవాక్కు అయ్యారు. ఆ గోతాల నిండా డబ్బుల కట్టలు కనిపించటంతో తనిఖీ అధికారుల నోట మాట రాని పరిస్థితి. అక్కడున్న గోతాల్ని విప్పదీయగా.. అన్నింట్లోనూ భారీగా నోట్ల కట్టలు దర్శనమివ్వటంతో అవాక్కు అయ్యారు.

భారీగా బయటపడిన నోట్ల కట్టల్ని మాన్యువల్ గా లెక్కించటానికి చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో.. బ్యాంకులకు వెళ్లి మెషిన్లు తెచ్చి మరీ లెక్కలు వేస్తున్నారు. మూడేళ్లుగా బెట్టియలో పని చేస్తున్న ఆక్ష్న పోగేసిన సంపదనుచూసినోళ్లంతా ముక్కునవేలేసుకుంటున్నారు. బిహార్ విద్యా వ్యవస్థ మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక్కడ పరీక్షా పేపర్లను అమ్ముకుంటారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే జిల్లా విద్యాశాఖాధికారులు కోట్లకు పడగలెత్తినట్లుగా చెబుతారు. దీనికి నిలువెత్తు రూపంగా తాజా ఉదంతాన్ని చెబుతున్నారు.