బీఫారాల బంతాట.. ఇండిపెండెంట్ దిశగా తమ్ముళ్లు
టీడీపీలో మరో కలకలం తెరమీదికి వచ్చింది. ఈ నెల 21న అభ్యర్థులకు బీఫాం అందిస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు.
By: Tupaki Desk | 20 April 2024 4:46 AM GMTటీడీపీలో మరో కలకలం తెరమీదికి వచ్చింది. ఈ నెల 21న అభ్యర్థులకు బీఫాం అందిస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ కూడా ఏర్పాట్లు చేసింది. కూటమి పొత్తులో భాగంగా.. మొత్తం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. తొలి జాబితా.. మలి జాబితా.. అంటూ.. మొత్తంగా 144 మంది అభ్యర్థులను ప్రకటించారు. కానీ, ఎక్కడో తేడా.. ఏదో మార్పు.. ఇంకా సంతృప్తి లేదు. దీంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత కూడా మార్పులు.
ఇదే ఇప్పుడు టీడీపీని తీవ్రస్థాయిలో ఇరుకున పడేస్తోంది. మాడుగుల, తిరువూరు, అరకు, రంపచోడవ రం, తంబళ్లపల్లె, గుంటూరు వెస్ట్, ఈస్టు, నగరి, శ్రీకాళహస్తి, ఉండి.. ఇలా.. పది నుంచి 15 స్థానాల్లో మార్పు లకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. ఆయా స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారం తా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతోమరోసారి నిర్వహించిన సర్వేలతో వారి జాతకాలు తెలిసిపోయాయనేది చంద్రబాబు మాట.
దీంతో ఇలాంటి వారి మార్పు తప్పదని సంకేతాలు ఇచ్చారు. కొందరిని బలవంతంగా అయినా.. మార్చా లని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మరికొందరిని.. ఏదో ఒకరకంగా.. బుజ్జగించాలని భావించారు. ఇలా.. 10 నుంచి 15 స్థానాల్లో మార్పులు తథ్యమని చెబుతున్నారు. మరోవైపు.. ఈ విషయాలను చాలా గోప్యంగా కూడా ఉంచుతున్నారు.ఇంకోవైపు.. బీఫారాలు ఇస్తున్నామని చెబుతున్నారు. దీంతో ఆశావహులు సైతం పార్టీ ఆఫీస్‌కు వస్తున్నారు.
ఆదివారం జరిగే కార్యక్రమంలో బాబు ఈ బీఫారాలు అందిస్తారు. అయితే.. ఇప్పటికే ప్రకటించిన వారు.. బీఫారాలపై ఆశలు పెట్టుకున్నవారు... కూడా పోటీకి సై అంటున్నారు. ఉండి నియోజకవర్గంనుంచి తిరువూరు వరకు.. మెజారిటీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తాము పోటీ చేస్తామని చెబుతున్నారు. బాబు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తమ పోటీ ఖాయమని అంటున్నారు. అంటే.. వీరంతా ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేయడంఖాయమని తెలుస్తోంది.
చిత్రం ఏంటంటే.. పాలకొండ, పోలవరంలో కూటమి పార్టీ జనసేన అభ్యర్థులను నిలబెట్టింది. కానీ.. ఇక్క డ నుంచి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు సిద్ధం చేసుకున్నారు. అంటే మొత్తంగా కూటమిలో నాయకులు ప్రశాంతంగా అయితేలేరనేది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.