భద్రాచలం మూల విరాట్ ఫోటోలు బయటకు.. అదెలా జరిగింది?
తాజాగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఒకడి అతి చేష్ట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అతడిపై పోలీసు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..
By: Tupaki Desk | 31 March 2024 5:31 AM GMTపలు ప్రముఖ దేవాలయాల్లోని మూలవిరాట్ ను ఫోటోలు.. వీడియోలు తీయటంపై పరిమితులతో పాటు.. కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అయితే..రూల్స్ ను పట్టించుకోకుండా వ్యవహరించేటోళ్లు అక్కడక్కడా కొందరు ఉంటారు. తాజాగా అలాంటి పిచ్చి పనే చేశాడో వ్యక్తి.
ప్రఖ్యాత భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఫోటోలు తీయటాన్ని నిషేధించి ఎంతోకాలమైంది.తాజాగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఒకడి అతి చేష్ట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అతడిపై పోలీసు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..
ఇటీవల రాములోరిని మహబూబాబాద్ మాజీ ఎంపీ.. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన సీతారాం నాయక్ కొందరు నేతలు.. కార్యకర్తలతో కలిసి భద్రాచలం రాములోరిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురిని వెంట తీసుకెళ్లారు. అలా వెంట వెళ్లిన వ్యక్తి ఒకరు మూలవిరాట్ విగ్రహాల్ని ఫోటోలు తీయటమే కాదు.. రామాలయానికి అనుబంధంగా ఉండే హనుమాన్ టెంపుల్ లోని మూలవిరాట్ ఫోటోల్ని తీశారు.
అనంతరం వాటిని సోషల్ మీడియాలోనూ..వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది. నిషేధం ఉన్న మూలవిరాట్ ఫోటోలు తీయటాన్నిఅధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోలు తీసిన వ్యక్తిని గుర్తించారు. దీంతో అతడిపై కంప్లైంట్ ఇవ్వటంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తించిన వారిని గుర్తించి.. చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అరుదైన ఫోటోలు.. వీడియోలతో పాపులర్ కావటానికి ఒక లెక్క ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అనవసర తలనొప్పులతో పాటు కేసుల పంచాయితీ నెత్తికి చుట్టుకోవటం ఖాయం.