నవంబర్ 9 నుంచి ఎన్టీవీ - భక్తి టీవీ కోటి దీపాల వెలుతురులు!
ఇందులో భాగంగా... ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 9 న ప్రారంభమై.. నవంబర్ 25 వరకు.. అంటే 17 రోజులపాటు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనుంది.
By: Tupaki Desk | 6 Nov 2024 1:35 PM GMT"దీపం జ్యోతిఃపరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే" అంటారు. అంటే.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుందని నమ్మకం. దీపం.. వెలుగుకు, జ్ఞానానికి సంకేతం.. ఆధ్యాత్మికంగా దీపానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది.
ఈ నేపథ్యంలో... 2013 నుంచి భక్తి టీవీ - ఎన్టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 9 న ప్రారంభమై.. నవంబర్ 25 వరకు.. అంటే 17 రోజులపాటు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనుంది.
అవును... ప్రతీ ఏటా హైదరాబాద్ వేదికగా ఎన్టీవీ - భక్తి టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా ప్రతీ ఏటా లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు తేదీల వివరాలు వెల్లడించారు.
కార్తీకమాసం వచ్చిందంటే భక్తి టీవీ - ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కార్తీక కోటి దీపోత్సవం ఎంత ప్రసిద్ధి చెందిందనేది తెలిసిందే. ఈ సమయంలో వరుసగా 14వ ఏటా ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ప్రతీ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కార్తీక మాసం రాగానే ప్రతీ హిందూ.. దేవీ దేవతల పూజలో నిమగ్నమైపోతారనే సంగతి తెలిసిందే. ఈ మాసంలో విశిష్టంగా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత 13 ఏళ్లుగా ప్రతీ ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు.
ఇక.. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం.. ఒక్కసారిగా ప్రజ్వలించే కోటి దీపాల వెలుతురులనే సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు ఒకేసారి, ఒకే ప్రాంగణంలో, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం గురించి మాటల్లో వర్ణించలేమని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఇది చెబితే తెలిసేది కాదు.. కన్నులారా చూసి, మనసారా ఆస్వాధిస్తేనే తెలిసే అంశం.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు రాష్ట్రాల నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచన కర్తలు, హైందవ సమాజ సేవకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో.. ఈ ఏడాది కూడా మరింతగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.