Begin typing your search above and press return to search.

బిచ్చగాళ్లందు ఈ బిచ్చగాడు వేరయా... విషయం తెలిస్తే షాకేనయా!

ఇందులో భాగంగా.. ప్రపంచం లోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా నిలిచాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 2:30 AM GMT
బిచ్చగాళ్లందు ఈ బిచ్చగాడు వేరయా...  విషయం తెలిస్తే షాకేనయా!
X

డైరెక్టుగా పాయింట్ లోకి వెళ్లిపోతే... ముంబై రద్దీ వీధుల్లో భరత్ జైన్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ భిక్షాటన ద్వారా ఊహించని అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. ఇందులో భాగంగా.. ప్రపంచం లోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా నిలిచాడని అంటున్నారు. ఈ సందర్భంగా అతడి సంపాదన ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... భరత్ జైన్ అనే బిచ్చగాడు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. వాస్తవానికి భరత్ జైన్ కుటుంబం కడు పేదరికంలో ఉండేదని అంటున్నారు. ప్రాథమిక అవసరాలకూ వారి వద్ద తగినంత డబ్బు లేని పరిస్థితి అని చెబుతున్నారు. దీంతో.. భరత్ స్కూలుకు వెళ్లే అవకాశం రాలేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సుమారు 40 ఏళ్లుగా భరత్ జైన్ తన ప్రధాన ఆదాయ వనరుగా యాచించడంపై ఆధారపడి ఉన్నాడు. ఈ క్రమంలో రోజూ సుమారు 10 నుంచి 12 గంటలు విరామం లేకుండా పని చేస్తాడని చెబుతున్నారు. ఈ క్రమంలో సగటున రోజుకు రు.2 వేల నుంచి రూ.2,500 వరకూ సంపాదిస్తాడట.

అంటే... ప్రతి నెలా సుమారు రూ.60,000 నుంచి రూ.75,000 సంపాదించవచ్చని అంటూనరు. ఈ సమయంలో తన సంపద పెంచుకోవడానికి పలు కీలకమైన ఆర్థిక నిర్ణయాలూ తీసుకున్నాడట భరత్ జైన్. ఇందులో భాగంగా... అతనికి రూ.1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయని చెబుతున్నారు.

ఇలా ఈ రెండు ఫ్లాట్లతో పాటు థానేలోని రెండు దుకాణాలతో నెలకు రూ.30,000 అద్దె కుడా వస్తుందని చెబుతున్నారు. ఇక భరత్ జైన్ కు ఇద్దరు కుమారులు ఉండగా.. వారిద్దరూ ఓ ప్రసిద్ధ కాన్వెంట్ లో చదువుతున్నారని అంటున్నారు. మరోపక్క జైన్ కుటుంబం స్టేషనరీ వ్యాపారం చేస్తున్నరని చెబుతున్నారు.

అయినప్పటికీ... కుటుంబ సభ్యుల విన్నపాన్ని మన్నించకుండా జైన్ బిక్షాటన చేస్తూనే ఉంటాడని చెబుత్ననారు. దీనిపై స్పందిస్తూ.. తాను బిక్షాటన చేయడాన్ని ఆనందిస్తానని.. దాన్ని వదులుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంటాడట. ఇలా మొత్తంగా రూ.7.5 కోట్ల సంపదను కలిగి ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో... భరత్ జైన్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది!