బీఆర్ఎస్ కన్నా ఎక్కువ చేస్తున్నాం: భట్టి
పదేళ్ల బీఆర్ఎస్ పాలన కన్నా కూడా తాము ఎక్కువగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
By: Tupaki Desk | 15 March 2025 12:37 PM ISTపదేళ్ల బీఆర్ఎస్ పాలన కన్నా కూడా తాము ఎక్కువగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధిని సమపాళ్లలో పంచుతున్నామని చెప్పారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో కూడా.. బీఆర్ఎస్ కంటే ఎక్కువగానే అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. అసెంబ్లీ బడ్జట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై భట్టి ప్రసంగించారు.
అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే రుణ మాఫీ చేశామని చెప్పారు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నా.. వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అందరూ సంతోషం గానే ఉన్నారని.. ఒక్క బీఆర్ఎస్ అధినేత, ఆయన కుటుంబం మాత్రమే సంతోషంగాలేరని.. ప్రజాతీర్పు ను కూడా వారు జీర్ణించుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది ఇప్పు డేనని ప్రజలు సైతం చెబుతున్నారని తెలిపారు.
సభలో అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని భట్టి విమర్శించారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తు న్నారని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని.. కానీ, వారు రైతులకు కష్టాలు సృష్టించేలా వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకులను చూసి సిగ్గుపడుతు న్నామన్నారు. ప్రజల సమస్యల కంటే కూడా.. ఎదుటి వారిని కించపరిచేలా వ్యాఖ్యానించడం.. వారి స్వలాభాల కోసం సభను వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.