Begin typing your search above and press return to search.

కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. ప్రజ్వల్‌ తల్లికి సిట్‌ నోటీసులు!

అవును... మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   31 May 2024 11:37 AM GMT
కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. ప్రజ్వల్‌  తల్లికి సిట్‌  నోటీసులు!
X

కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ కేసు వ్యవహారం ఇప్పుడు సిట్ చేతిలోకి పూర్తిగా వెళ్లిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులూ విదేశాల్లో ఉన్న ఎంపీ ప్రజ్వల్ ని.. గురువారం అర్ధరాత్రి దాటాక సిట్ పోలీసులు అరెస్ట్ చేయడంతో విచారణ వేగవంత మవుతుందని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది.

అవును... మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ప్రజ్వల్ తల్లికి సిట్‌ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ ను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(ఏ), 365, 109, 120(బీ) కింద సిట్‌ నోటీసులు ఇచ్చింది.

తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌ లోని వారి నివాసంలోనే జూన్‌ 1న ఉ.10 గంటల నుంచి సా.5 గంటల మధ్య అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది. ఓ మహిళపై ప్రజ్వల్ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఉన్న వీడియోలో.. భవానీ కూడా కనిపించారట. దీంతో బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఆమెపైన కిడ్నాప్ కేసు నమోదైంది.

కాగా... శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌ కు వచ్చిన ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి నేరుగా విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌ కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్డీయే కూటమి తరఫున హాసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ... పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన ఏప్రిల్‌ లో దేశం విడిచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అతనిపై మూడు కేసులు నమోదు అయ్యాయి.